Puri Sethupathi: టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా కొనసాగాడు పూరి జగన్నాథ్. అతడితో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్స్‌తో సీన్ మొత్తం మారిపోయింది. పూరితో సినిమా అంటేనే తెలుగు హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. తెలుగు హీరోలు హ్యాండివ్వడంతో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ మూవీలో టబు, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
స్లమ్‌డాగ్…
గత సినిమాలకు భిన్నంగా వెరైటీ కాన్సెప్ట్‌తో పూరి జగన్నాథ్ ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ టైటిల్ అది కాదట. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీకి స్లమ్‌డాగ్ అనే టైటిల్‌ను కన్ఫామ్ అయినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 28న.. స్లమ్‌డాగ్ టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు.
Also Read- Deepika Padukone: ప్రభాస్‌కు హ్యాండిచ్చి…. హాలీవుడ్ హీరోతో సినిమా చేస్తున్న దీపికా పదుకొనె
ఐదేళ్ల తర్వాత…
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీ షూటింగ్ సగానికిపైగా పూర్తయిందట. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టబు పూరి జగన్నాథ్ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. చివరగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా చేసింది టబు. పూరి జగన్నాథ్ మూవీలో టబు క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని ప్రచారం జరుగుతోంది.
ఐదు భాషల్లో…
విజయ్ సేతుపతి సినిమాను ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రిజల్ట్‌పైనే డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ కెరీర్ ఆధారపడి ఉంది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో జనగనమణ సినిమాను అనౌన్స్‌చేశాడు పూరి జగన్నాథ్. కానీ లైగర్ డిజాస్టర్‌తో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు విజయ్ దేవరకొండ.
Also Read- Ananya Nagalla: బతుకమ్మ సంబరాల్లో అనన్య.. ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిందిగా..
పూరి జగన్నాథ్ సినిమా కంటే ముందు తెలుగులో ఉప్పెన, సైరా నరసింహారెడ్డి, మైఖేల్ సినిమాలు చేశాడు విజయ్ సేతుపతి. అయితే తెలుగులో హీరోగా సినిమా చేయడం మాత్రం ఇదే మొదటిసారి.


