Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభVijay Varma: తమన్నాతో బ్రేకప్ తర్వాత డిప్రషన్‌లో విజయ్ వర్మ..?

Vijay Varma: తమన్నాతో బ్రేకప్ తర్వాత డిప్రషన్‌లో విజయ్ వర్మ..?

Vijay Varma: తమన్నాతో బ్రేకప్ తర్వాత డిప్రషన్‌లో విజయ్ వర్మ..? అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు లవ్ లో పడటం.. పెళ్ళి చేసుకోవడం బాగానే ఉంటుంది. కానీ, కలిసి ఎన్నేళ్ళు ఉంటారో.. ఏ కారణాల చేత విడిపోతున్నారో మాత్రం అంతుచిక్కడం లేదు. బయటకి మాత్రం ఈగో ప్రాబ్లమ్ అనే ఒక్క మాట మాత్రమే వినిపిస్తోంది. ఏళ్ళ తరబడి కలిసి కాపురం చేసి పిల్లల్ని కన్న స్టార్ కపుల్స్ కూడా చాలా సింపుల్‌గా డివోర్స్ తీసుకుంటున్నారు.

- Advertisement -

అలా విడిపోయిన జంట ఎంత సుఖంగా ఉంటున్నారనేది అందరిలోనూ ఓ హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ లో సమంత-నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని రెండు మత సాంప్రదాయాల ప్రకారం ఎంతో వైభగంగా పెళ్లి చేసుకున్నారు. కానీ, అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి సమంత సరైన కెరీర్ ని లీడ్ చేయలేకపోతోందని కామెంట్ వినిపిస్తున్నాయి. కానీ, తాను మాత్రం నిర్మాతగా, నటిగా బిజీగా ఉంది.

నాగ చైతన్య కూడా శోభితను పెళ్లి చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు సినీ కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా పాపులర్ అయిన సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు, తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసింది. స్పెషల్ నంబర్స్ లోనూ తమన్నాకి ఉన్న క్రేజ్ మరో హీరోయిన్‌కి లేదు. కానీ, గత కొంతకాలంగా పర్సనల్ లైఫ్ మాత్రం బాగానే డిస్ట్రబ్ చేసుకుంది.

Also Read – Anupama Parameswaran: వైరల్‌గా మారిన మార్ఫింగ్ ఫొటోలపై అనుపమ పోస్ట్

తెలుగులో ఎంసిఎ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ వర్మ తో కలిసి తమన్నా లస్ట్ స్టోరీస్ 2లో నటించింది. ఇందులో ఉన్న కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఇద్దరి మధ్య అగ్గి రాజేసి రిలేషన్ వరకూ దారి తీసింది. కొన్ని నెలలైతే ఎక్కడ చూసినా తమన్నా-విజయ్ వర్మలే. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు దాదాపు కన్‌ఫర్మ్ చేశారు. కానీ, ఆ తర్వాత ఇద్దరూ విడిపోతున్నట్టుగా చెప్పకనే చెప్పారు.

దీంతో విజయ్ వర్మ బాగా డిప్రషన్ కి గురై సినిమాల పరంగానూ గ్యాప్ రావడంతో ఏం చేయాలో తోచక ఒక సమయంలో పూర్తిగా డిప్రషన్ కి లోనయైనట్టు తెలిపాడు. ఆ సమయంలో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, గుల్షన్ దేవయ్య అండగా నిలిచి తనకు తరచూ కాంటాక్ట్ లో ఉంటూ తన డిప్రషన్ ని దూరం చేశారని..లేదంటే పిచ్చోడిలా మారేవాడినని తెలిపాడు. వీరిద్దరూ నాతో రోజూ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఒకేచోట ఆగిపోకుండా కెరీర్ లో ముందుకు సాగాలని ఎంతో ప్రోత్సహించినట్టుగా చెప్పాడు. కాగా, ప్రస్తుతం విజయ్ వర్మ గుస్తాక్ ఇష్క్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా నవంబర్ 28న రిలీజ్ కాబోతోంది. చూడాలి మరి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి కెరీర్ ఊపందుకుంటేదేమో.

Also Read – Chiru-Charan: రికార్డులు సృష్ఠించాలంటే మెగా హీరోలే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad