Tuesday, June 24, 2025
Homeచిత్ర ప్రభVijay Varma: దంగల్ బ్యూటీతో తమన్నా మాజీ లవర్

Vijay Varma: దంగల్ బ్యూటీతో తమన్నా మాజీ లవర్

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. 15 ఏళ్ళ నుంచి హీరోయిన్‌గా కొనసాగుతున్న తమన్నా..ఇప్పటి వరకు పెద్దగా నెగిటివిటీ తెచ్చుకోలేదు. ఆమెపై వచ్చిన పుకార్లు కూడా చాలా తక్కువ. కానీ, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ తో డేటింగ్ వ్యవహారం మాత్రం తమ్ము బేబీని వైరల్ చేసింది. ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. ఘాటు బెడ్రూం సీన్స్‌లో రెచ్చిపోయారు.

- Advertisement -

అక్కడే, ఇద్దరికీ వేడి పుట్టింది. దాంతో క్న్నాళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారు. దాదాపు పెళ్లి వరకూ వచ్చారు. కానీ, అనూహ్యంగా కొన్ని నెల‌లోనే ఈ జంట విడిపోయి షాకిచ్చారు. త‌మ‌న్నా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల‌వ్వాల‌నుకుంది. పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగాలనే కోరికను నిర్మొహమాటంగా విజ‌య్ తో చెప్పింది. ఈ విషయంలో ఇద్దరికీ విబేధాలు తలెత్తాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/tollywood-star-heroes-making-milestone-movies-in-their-careers/

తెలుగు వాడైనప్పటికీ, బాలీవుడ్ లో విజ‌య్ బిజీగా ఉన్నాడు. అందుకే, త‌న కెరీర్ ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. కానీ, త‌మ‌న్నా పెళ్లి తర్వాత సినీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒత్తిడి చేసినట్టుగా బాలీవుడ్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్యా ఏం జరిగిందో క్లారిటీ లేదు గానీ, ఎంత ఫాస్ట్ గా ఈ కపుల్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారో అంతే ఫాస్ట్‌గా సైలెంట్ అయ్యారు.

ఫైనల్ గా విజయ్,తమన్నా జంట విడిపోయింది. తమన్నా పూర్తిగా సినిమాల మీద దృష్టి సారించింది. ఏ భాషలో ఐటం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. అయితే, తమన్నాతో బ్రేకప్ అయ్యాక విజయ్ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌తో తిరుగుతున్నాడట. ప్రస్తుతం వీరిద్దరు డీప్ లవ్‌లో ఉన్నారని ముంబై మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిన్నా మొన్నటి వరకూ ఈ బ్యూటీతో సీనియర్ నటుడు ఆమిర్ ఖాన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో విజయ్-ఫాతిమా ల ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతూ రక రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారో ఎవరు ఎవరితో విడిపోయారో ఏ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారో ఆ దేవుడికే తెలియాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News