Bison Review: హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘బైసన్’. తమిళంలో గత వారం విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది వరకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తే మంచి స్పందనే వచ్చేది. దీంతో ‘బైసన్’ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేశారు. గ్రామంలో ఉండే గొడవలు.. కబడ్డీ ఆటకు లింకప్ చేసి సినిమాను తెరకెక్కించారు. కబడ్డీ ఆటకు, గ్రామంలోని గొడవలకు ఉన్న లింకేంటి? ధ్రువ్ విక్రమ్ నటుడిగా మెప్పించాడా? అసలు దర్శకుడు ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు? అనే విషయం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
తూతుకూడి ప్రాంతంలోని ఓ గ్రామంలో స్వామి (పశుపతి)కి ఇద్దరు పిల్లలు. భార్య పాము కాటుకి చనిపోతుంది. అప్పటి నుంచి పిల్లలే తన లోకంగా బతుకుతుంటాడు సామి. సామి కొడుకు కిట్టయ్య (ధ్రువ్)కి కబడ్డీ అంటే ప్రాణం. అదే సమయంలో ఆ ఊర్లో ఉండే కందసామి, పాండ్యరాజ్‌కు ఆధిపత్య పోరు జరుగుతుంటుంది. కబడ్డీ ఆట ఆడుతూ ఎక్కడ తన కొడుకు ఇలాంటి గొడవల్లో తలదూర్చి జీవితాన్ని పాడు చేసుకుంటాడోనని సామి భయపడి కొడుకుని కబడ్డీ ఆడనివ్వడు. అయితే కిట్టయ్యలోని కబడ్డీ టాలెంట్‌ను గుర్తించిన తన స్కూల్ టీచర్ అతన్ని కబడ్డీ ఆడమని ప్రోత్సహిస్తాడు. తను కూడా ఆ స్టేట్‌లోనే గొప్ప కబడ్డీ ప్లేయర్‌గా ఎదుగుతుంటాడు. ఆ క్రమంలో అనుకోకుండా జరిగే ఓ గొడవతో కిట్టయ్య ఇబ్బందుల్లో పడతాడు. అయినా కూడా ఆటను వదిలి పెట్టకుండా ముందుకెళుతుంటాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని విషయాల్లో అవమానాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ దాటుకుని కిట్టయ్య ఎలా ఎదిగాడు? జపాన్ ఒలింపిక్స్‌కు ఎలా ఎన్నికయ్యాడు? అక్కడ తనకు ఎదురైన అనుభవాలేంటి? తన జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
Also Read- Samantha: సమంత బ్యాక్ ఆన్ సెట్స్ – సైలెంట్‌గా మా ఇంటి బంగారం షూటింగ్ స్టార్ట్
సమీక్ష:
ఈ సినిమాను ధ్రువ్ ఆసాంతం వన్ మ్యాన్ ఆర్మీలా ముందుకు నడిపించాడు. తండ్రికి తగ్గ కొడుకులా సినిమా కోసం ప్రాణం పెట్టేశాడు. ఓ గ్రామంలో ఉండి రెండున్నరేళ్లు కబడ్డీ ఆటను నేర్చుకున్నాడంటే తన డేడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అదే డేడికేషన్, కమిట్‌మెంట్ కిట్టయ్య పాత్రలో అతను ఒదిగిన తీరును చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తన లుక్, ఎమోషనల్ ట్రాన్సఫర్మేషన్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. క్యారెక్టర్‌ను అంతగా ఓన్ చేసుకుని నటించే యాక్టర్స్ అరుదుగా ఉంటారు. కొడుకు బాగుకోసం తాపత్రయ పడే తండ్రిగా పశుపతి జీవించేశారు. తమ్ముడికి సపోర్ట్ చేసే పాత్రలో.. హీరో అక్కగా రజిషా విజయన్ చక్కగా నటించింది. హీరోని అమితంగా ప్రేమించే అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్ నటన బావుంది. డీ గ్లామర్ పాత్రను ఆమె క్యారీ చేసిన తీరు బావుంది. కోచ్‌గా నటించిన మదన్, ఊర్లో పెద్ద మనుషలుగా గొడవలు పడే ఆమిర్, లాల్ ఇలా అందరూ వారి వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
సాంకేతికంగా చూస్తే.. డైరెక్టర్ మారి సెల్వరాజ్ స్టోరీ టెల్లింగ్‌లో ఓ స్టైల్ ఉంటుంది. ఆయన సినిమా కాన్సెప్ట్స్ అన్నీ కుల ఘర్షణ, అణగారిని వర్గ పోరాటాలపైనే ఉంటాయి. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అదే. అయితే ఈసారి దీనికి కబడ్డీ అనే ఆటను చేర్చాడు. సాధారణంగానే మన క్రీడల్లో ఆటగాళ్ల ఎంపికలో రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి థీమ్‌కు గ్రామాల్లో గొడవలు, తగాదాలను యాడ్ చేశాడు. అలాగని ఇదేమైనా కల్పిక కథనా అనుకుంటే తప్పే.. నిజ ఘటనల ఆధారంగానే కథను రూపొందించారు మారి సెల్వరాజ్.
Also Read- Astrology: 12 ఏళ్ల తర్వాత పవర్ పుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
హీరో పాత్రనే కాదు.. సపోర్టింగ్ రోల్స్‌ను కూడా బలంగా చూపించాడు మారి సెల్వరాజ్. అసలు గ్రామాల్లో గొడవలు ఎలా మొదలవుతాయి. ఎలా పెరుగుతాయి. ఎలా కంటిన్యూ అవుతాయనే విషయాలను లాల్, ఆమిర్ పాత్రలతో చూపించారు. కొడుకు బాగు కోసం తాపత్రయ పడే పశుపతి పాత్రలోని ఎమోషన్స్ కూడా బలంగా చూపించారు. ప్రేమకు దూరమైన అమ్మాయిగా బేలగా కనిపించే పాత్రలో రజిషా, కావాలనుకున్న ప్రేమ కోసం ఫైట్ చేసే అమ్మాయిగా అనుపమ పాత్రలను చక్కగా ఎలివేట్ చేశాడు డైరెక్టర్. ఆటల్లో జరిగే కుల రాజకీయాల గురించి ప్రస్తావించాడు కానీ.. ఎవరినో విమర్శించాలనే రీతిలో మాత్రం ఆ అంశం చుట్టూ కథను నడపలేదు. కొన్ని చోట్ల హై మూమెంట్స్ మిస్ అయిన ఫీలింగ్ స్పష్టంగా తెలుస్తుంది. తమిళ నెటివిటీ చుట్టూనే సినిమా నడిచింది. నివాస్ కె.ప్రసన్న బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎళిల్ అరసు విజువల్స్ నెరేషన్‌కు ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. పాటలు అర్థం కావు.. తెలుగు నెటివిటీ మిస్ అయ్యింది.
చివరగా.. బైసన్.. మారి సెల్వరాజ్ మార్క్ సినిమా
రేటింగ్ – 2.5/5


