Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభVishal: అవార్డులు పనికిరావు… నాకొస్తే చెత్తబుట్టలో పడేస్తా!

Vishal: అవార్డులు పనికిరావు… నాకొస్తే చెత్తబుట్టలో పడేస్తా!

Vishal: హీరో విశాల్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఇటీవల ఆయన ప్రారంభించిన తన కొత్త పోడ్‌కాస్ట్ “యూర్స్ ఫ్రాంక్లీ విశాల్” లో అవార్డుల వ్యవస్థపై చేసిన ఘాటు వ్యాఖ్యలు సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisement -

విశాల్ తన పోడ్‌కాస్ట్‌లో అవార్డుల గురించి మాట్లాడిన మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. అవార్డులు ‘పనికిరాని విషయం’ విశాల్
“నేను అవార్డులను అస్సలు నమ్మను. అవార్డు అనేది ఒక ‘పనికిరాని విషయం’ అని విశాల్ చాలా సూటిగా వ్యాఖ్యానించారు.
“ఒక సినిమాను లేదా ఒక నటనను కోట్ల మంది ప్రజలు, అభిమానులు ఇష్టపడుతున్నారు. కానీ, కేవలం ఎనిమిది మంది (అవార్డుల కమిటీ సభ్యులు) కూర్చుని, ఆ కోట్లాది మంది ఇష్టాన్ని నిర్ణయించడం, ఏది బెస్ట్ అని ప్రకటించడం ఎంతవరకు సమంజసం? ఇది పూర్తిగా పిచ్చితనం” అని అన్నాడు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-upcoming-seven-movies-2025-to-2030/

నేషనల్ అవార్డ్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది!

విశాల్ చేసిన ఈ కామెంట్స్ కేవలం చిన్న ప్రైవేట్ అవార్డుల గురించి మాత్రమే కాదు. ఆయన ఏకంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌కు కూడా తన అభిప్రాయం వర్తిస్తుందని స్పష్టం చేశాడు.”నేను ఈ మాటలు చెబుతున్నది, నాకు అవార్డు రాలేదనే బాధతో కాదు. అసలు ఈ అవార్డుల కాన్సెప్ట్‌నే నేను నమ్మను” అని విశాల్ అన్నాడు.

“నాకొస్తే చెత్తబుట్టలో పడేస్తా!”

ఒకవేళ నాకు ఎవరైనా ఏదైనా అవార్డు ఇస్తే… నేను దానిని పట్టుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తాను” అంటూ సంచలనం సృష్టించాడు. అయితే, చివర్లో ఒక మెలిక పెట్టాడు. “దయచేసి తప్పుగా అనుకోకండి. ఒకవేళ ఆ అవార్డు బంగారంతో చేసి ఉంటే, నేను దాన్ని అమ్మి ఆ డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాను” అని హాస్యాన్ని జోడించాడు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/mamitha-baiju-golden-time-vijay-surya-films/

విశాల్ ఎప్పటి నుంచో తన దృష్టిలో అభిమానుల ఆదరణే నిజమైన అవార్డు అని చెబుతున్నాడు. ఆ అభిప్రాయాన్ని ఇప్పుడు మరోసారి గట్టిగా చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ ఈ కామెంట్స్‌ను వైరల్ చేస్తున్నారు.
ఇదే పోడ్‌కాస్ట్‌లో, తాను ఇప్పటివరకు ఏ స్టంట్‌కు డూప్‌ను వాడలేదని, తన శరీరంపై 119 కుట్లు పడ్డాయని విశాల్ చెప్పడం కూడా జరిగింది.

మొత్తానికి, విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు.. అవార్డులు దక్కిన వారికి, దక్కని వారికి మధ్య ఒక పెద్ద చర్చకు తెరలేపాయి. ఆయన వ్యాఖ్యలు సరైనవా కాదా అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad