Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభVishal: ఇళయరాజాపై దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. విశాల్ ఆగ్రహం

Vishal: ఇళయరాజాపై దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. విశాల్ ఆగ్రహం

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja)పై దర్శకుడు మిస్కిన్‌ (Mysskin) వివాదాస్పద వ్యాఖ్యలు చేయండపై తమిళ హీరో, నడిగర్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ విశాల్‌ (Vishal) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది సంగీతప్రియులు ఆరాధించే ఇళయరాజా గురించి అలా వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారిందని ఫైర్ అయ్యారు. నలుగురిలో స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని సూచించారు. ఇళయరాజా లాంటి గొప్ప వ్యక్తిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని క్షమించనన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఆ తర్వాత క్షమాపణలు చెబితే సరిపోతుందా అని విశాల్‌ ప్రశ్నించారు.

- Advertisement -

కాగా ఇటీవల ‘బాటిల్‌ రాధ’ అనే సినిమా ఈవెంట్‌కు హాజరైన మిస్కిన్.. ఇండస్ట్రీలో ఉన్న వారందరికంటే తానే ఎక్కువగా మద్యం తాగుతానని తెలిపారు. అనంతరం ఇళయరాజా సంగీతం వల్ల చాలా మంది ప్రజలు మద్యానికి బానిసలయ్యారని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తాను సరదాగా అన్న వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad