డైనమిక్ స్టార్ విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ హిస్టారికల్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ చేయాలనే లక్ష్యంతో ఆయన గ్లోబల్ టూర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌ను మొదట అమెరికాలో ప్రారంభించనున్నారు. విష్ణు మంచు USA టూర్ మే 8న న్యూజెర్సీ నుంచి ప్రారంభమవుతుంది. ఆయన నార్త్ బ్రున్స్‌విక్‌లోని రీగల్ కామర్స్ సెంటర్లో అభిమానులతో సమావేశమవుతారు. తర్వాతి రోజు, మే 9న టెక్సాస్‌లోని డల్లాస్కు వెళ్లి, సాయంత్రం 7 గంటలకు గెలాక్సీ థియేటర్స్ గ్రాండ్‌స్కేప్, ది కాలనీలో ప్రేక్షకులతో ముచ్చటించనున్నారు.
ఈ టూర్ మే 10న శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ముగుస్తుంది. అక్కడ ఉదయం 10:30 గంటలకు సినీ లాంజ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా, అమెరికాలో సినిమా ఓవర్సీస్ రిలీజ్ బాధ్యతలు వాసారా టీమ్ చూసుకుంటోంది. అమెరికా పర్యటన అనంతరం విష్ణు ఇండియాకు తిరిగివచ్చి, దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా, విష్ణు భక్తులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులతో కలవనున్నారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల మీడియా ముందు ప్రస్తావించేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు.
ఇంతకు ముందు విడుదలైన భక్తి గీతం “శివా శివా శంకరా” మంచి స్పందన పొందింది. ఇకపోతే, సినిమాలోని ప్రేమ గాథా సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అందరి దృష్టి ట్రైలర్‌పై ఉంది. ట్రైలర్ విడుదలైన వెంటనే అంచనాలు రెట్టింపు కానున్నాయి. ‘కన్నప్ప’ చిత్రాన్ని జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.