Rashtrapati Bhavan: మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఢిల్లీలోని భారత రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇది చిత్ర బృందానికి, మంచు విష్ణుకు విశేషమైన గుర్తింపును తీసుకొచ్చింది. సినిమా వీక్షించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు విష్ణు నటనను ప్రశంసిచారు. ఒక సినిమాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన లభించడం చాలా అరుదు, ఇది ‘కన్నప్ప’ చిత్రానికి లభించిన గొప్ప గౌరవం.
కన్నప్ప చిత్రాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శించటంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతకు దక్కిన ఈ గుర్తింపు తమకెంతో గర్వ కారణమని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. హిందీలో మహాభారతం సీరియల్‌ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ‘కన్నప్ప’ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. విష్ణు నటన, భావోద్వేగాలు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ పాత్రలు, సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక శివ భక్తుడి పాత్రలో విష్ణు ఒదిగిపోయిన తీరు అందరినీ మెప్పించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఇందులో ‘రుద్ర’ పాత్రలో మెరిశారు. శివపార్వతులుగా అక్షయ్‌కుమార్ మరియు కాజల్ అగర్వాల్ తమ పాత్రలకు జీవం పోశారు. అలాగే, విలక్షణ నటుడు మోహన్‌లాల్ ‘కిరాతకుడు’ పాత్రలో అలరించారు.
Also Read – Scholarship: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీట్ల సంఖ్య భారీగా పెంపు!
విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప సినిమాను రూపొందించారు. దీనికి మోహన్ బాబు (Manchu Mohan Babu) నిర్మాతగా వ్యవహరించారు. పదేళ్ల పాటు ఈ సినిమాపై వర్క్ చేసిన విష్ణు కథను సిద్ధం చేయటం విశేషం. ఇందులో హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ నటించింది. వాయులింగం గొప్పదనాన్ని తెలియజేస్తూ, పరమేశ్వరుడి గొప్ప భక్తుడైన కన్నప్ప జీవితాన్ని ఈ సినిమాతో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వంద కోట్లకు పైగానే ఖర్చు పెట్టి కన్నప్ప చిత్రాన్నినిర్మించారు. సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టంలో సఫలం కాలేకపోయిందనే చెప్పాలి. సినీ సర్కిల్స్ సమాచారం మేరకు కన్నప్ప మూవీకి రూ.50 కోట్ల మేరకు వచ్చాయి. సినిమాకు వంద కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.
Also Read – SS Rajamouli: రాజమౌళి కెరీర్‌లో బెస్ట్ మూవీ అదేనట – ఆస్కార్ విన్నింగ్ మూవీకి హ్యాండిచ్చిన జక్కన్న


