Wednesday, June 25, 2025
Homeచిత్ర ప్రభKannappa: ‘కన్నప్ప’పై నెగటివ్ రివ్యూ రాస్తే కేసు.. విష్ణు మాస్ వార్నింగ్

Kannappa: ‘కన్నప్ప’పై నెగటివ్ రివ్యూ రాస్తే కేసు.. విష్ణు మాస్ వార్నింగ్

Vishnu Manchu: కన్నప్ప సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ, విడుదలకు ఒక్క రోజు ముందు మంచు విష్ణు ఇచ్చిన షాక్ నోటీసు ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. గత రెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి, ఎన్నో అవాంతరాలను అధిగమించి మంచు విష్ణు, ఆయన టీమ్ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ ట్రోల్స్ ఆగడం లేదని, విడుదలకు ముందు కూడా నెగిటివ్ బజ్ సృష్టిస్తున్నారని మంచు విష్ణు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ద్వారా సంచలన హెచ్చరిక నోటీసును జారీ చేశారు.

- Advertisement -

జూన్ 27, 2025 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న కన్నప్ప చిత్రాన్ని చూసిన తర్వాతే, దాని సారాంశాన్ని అర్థం చేసుకుని, సినిమా ఉద్దేశాన్ని గౌరవిస్తూ రివ్యూలు రాయాలని మంచు విష్ణు కోరారు. అంతేకాదు, ప్రతీకార వ్యాఖ్యలకు, పక్షపాతాలకు చోటివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


భావ ప్రకటన స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1)(a)) పవిత్రమైనదే అని అంగీకరించినా, ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం, పరువు నష్టం కలిగించడం లేదా సినిమాను లీక్ చేయడం వంటి చర్యలు న్యాయపరమైనవి కావని ఆయన తేల్చి చెప్పారు. యూనియన్ ఆఫ్ ఇండియా, ముబీన్ రౌఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కు సంబంధించిన కేసుల్లో హైకోర్టు ఇచ్చిన పరిశీలనలను కూడా విష్ణు ఈ సందర్భంగా తన వార్నింగ్ నోటీసుల్లో పేర్కొన్నారు.

https://x.com/kannappamovie/status/1937745068921896962

ఒకవేళ ఎవరైనా ఈ హెచ్చరికలను జోక్‌గా తీసుకుని, నిరాధారమైన ఆరోపణలు చేసినా, సినిమా ప్రతిష్టను దెబ్బతీసినా, లీక్ చేసినా, సివిల్, క్రిమినల్, సైబర్ అధికార పరిధితో సహా అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంచు విష్ణు క్లియర్‌గా చెప్పారు. మొత్తానికి, నెటిజన్లు కూడా ఈ నోటీసును గట్టి వార్నింగ్ గానే భావిస్తున్నారని చెప్పాలి. కన్నప్ప టీమ్ తమ సినిమా పట్ల అంకితభావం, పట్టుదలకు ఇది నిదర్శనం. కాబట్టి నెగిటివ్ థాట్స్‌తో రివ్యూలు రాసేవాళ్లు జాగ్రత్త మరి!

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vijay-antony-sensational-comments-on-his-political-entry-and-drugs-issue/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News