Chiranjeevi – Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విశ్వంభర. యంగ్ డైరెక్టర్ వశిష్ట మూవీని తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫాంటసీ జోనర్ మూవీగా రానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిదని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఐటెమ్ సాంగ్‌లో చిరు సరసన ఎవరు డాన్స్ చేస్తారనే దానిపై చాలా రకాలైన వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీలో బాలీవుడ్ నటి మౌనీరాయ్ ఐటెమ్ సాంగ్ చేయబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి సినిమాలో ఐటం సాంగ్ ఉంటే అది మాస్ ఆడియన్స్ కి మాంచి మాస్ ఫీట్‌గా ఉంటుంది. అందుకే, ఎక్కువగా దర్శకులు ఆయన సినిమాలో స్టార్ హీరోయిన్ ని గానీ, హాట్ బ్యూటీని గానీ ఐటం సాంగ్ కోసం తీసుకొస్తుంటారు.
వాల్తేరు వీరయ్య సినిమాలోనూ ఊర్వశీ రౌతెల సాంగ్ బాగా ఎంజాయ్ చేశారు మెగాస్టార్ ఫ్యాన్స్. ఇప్పుడు మౌనీరాయ్ అలియాస్ నాగినీ తెలుగు ఇండస్ట్రీకి ఐటం పాటతో విశ్వంభర సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. నాగిని అనే డబ్బింగ్ సీరియల్ ద్వారా మౌనీ తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితురాలు. ఈ సీరియల్ మాత్రమే కాకుండా హిందీలో కొన్ని సినిమాలు కూడా చేశారు మౌనీ. ఈ క్రేజ్ ఉండటం వల్లే విశ్వంభర సినిమాలో ఐటం భామగా దర్శకుడు వశిష్ఠ మౌనీరాయ్ ని ఎంపిక చేశారట.
Also Read – Vijay Deverakonda: బాలీవుడ్ సినిమాలో విలన్‌గా ఆఫర్… రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ… కారణం ఇదేనా?
ఇక ఇందులో మౌనీ రాయ్ ని ఎంపిక చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క సాంగ్ మాత్రమే కాకుండా కొన్ని కీలక సన్నివేశాలలోను కనిపించబోతుందట. అందుకనే ఈ రోల్ కి ఆమె అయితేనే కరెక్ట్ గా సూటవుతారని ఎంపిక చేసినట్లు చెప్పుకుంటున్నారు. విశ్వంభర సోషియా ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోంది. గతంలో మెగాస్టార్ యుముడికి మొగుడు, అంజి లాంటి చిత్రాలను చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇంతకాలానికి సోషియా ఫాంటసీ మూవీతో వస్తున్నారు.
ఈ సినిమాలోనూ అతీంద్రియ శక్తులను హైలైట్ చేసి చూపించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే నాగ లోకానికి సంబంధించిన సన్నివేశాలలో నాగినీగా మౌనీ రాయ్ కనిపించబోతున్నారట. ఇక హీరోయిన్‌గా ఇందులో త్రిష కృష్ణన్.. కీలక పాత్రలో ఆషిక రంగనాథ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి. వీఎఫెక్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే ఈ ఏడాది సెప్టెంబర్ లో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తారు.
Also read – Sreeleela: వామ్మో…జూనియర్ కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?


