Ramayana: పాన్ ఇండియన్ కల్చర్ కారణంగా హీరోలు మాత్రమే కాకుండా ఇతర యాక్టర్ల రెమ్యూనరేషన్లు భారీగా పెరిగాయి. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. ఒకప్పుడు ఓ పది సినిమాలు చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ ఇప్పుడు ఒక్క సినిమాతోనే సంపాదించే పరిస్థితి ఉంది. రెమ్యూనరేషన్ల విషయంలో హీరోలు, యాక్టర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి టైమ్‌లో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ రామాయణ సినిమా కోసం ప్రొడ్యూసర్లు ఇచ్చిన రెమ్యూనరేషన్‌ను వదులుకోవడానికి రెడీ అయ్యారట. పైసా తీసుకోకుండా ఈ సినిమాలో నటిస్తున్నారట. రామాయణం సినిమా కోసం తాను తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ను క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి విరాళంగా అందజేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. మంచి పని కోసం ఆ డబ్బును ఉపయోగించడం ఆనందంగా ఉందని అన్నారు. “నాకు ఒక్క పైసా వద్దు.. నా రెమ్యూనరేషన్ మొత్తాన్ని క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసమే వినియోగించమని” నిర్మాతలకు చెప్పేశాను అని వివేక్ ఒబెరాయ్ చెప్పారు. ఈ బాలీవుడ్ నటుడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రామాయణ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రాముడిగా రణభీర్‌కపూర్ నటిస్తుండగా… సీత పాత్రను సాయిపల్లవి పోషిస్తుంది. రావణుడిగా కన్నడ నటుడు యశ్ కనిపించబోతున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణ రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి పార్ట్ 2026 నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read – The RajaSaab: ప్రభాస్ రాజాసాబ్‌కు ఓటీటీ కష్టాలు – నాన్ థియేట్రికల్ డీల్ పెండింగ్ – కారణం ఇదే?
ఈ మైథలాజికల్ మూవీలో విభీషణుడిగా వివేక్ ఒబెరాయ్ కనిపించబోతున్నాడు. రామాయణతో పాటు ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్‌లో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటించనున్నాడు. ఈ సినిమాకు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
బాలీవుడ్‌లో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు వివేక్ ఒబెరాయ్. హీరోగానే కాకుండా విలన్‌గా చాలా సినిమాల్లో కనిపించాడు. తెలుగులోనూ రక్త చరిత్ర, వినయ విధేయరామ సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్స్‌లో నటించాడు. మూడేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న వివేక్ ఒబెరాయ్ ఇటీవల రిలీజైన కేసరీ వీర్‌తో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
Also Read – Nandamuri Balakrishna: ‘అఖండ 2’ ఓటీటీ డీల్ అందుకే క్లోజ్ అవలేదా..?


