Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభWAR 2 Climax : క్లైమాక్స్... ఎన్టీఆర్ కోసమే మార్చారా?

WAR 2 Climax : క్లైమాక్స్… ఎన్టీఆర్ కోసమే మార్చారా?

WAR 2 Climax: బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ వారం వార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమా కథ అనుకున్నప్పుడు ఎన్టీఆర్ పాత్ర క్లైమాక్స్ లో చనిపోవాల్సి ఉందట. కానీ, తారక్ పాత్రను అలా ఎండ్ చేస్తే. ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ ఒప్పుకోవడం అసాధ్యమని ఎన్టీఆర్ చెప్పడంతో దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లైమాక్స్ ని మార్చాల్సి వచ్చిందట.

- Advertisement -

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు వార్ 2 కోసం చాలా శ్రమించారు. సినిమా కోసం ది బెస్ట్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం యష్ రాజ్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ. ఈ మేకర్స్ చేసే స్పై యూనివర్స్ సిరీస్ లకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తారక్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ, వార్ 2 లో గ్రాఫిక్స్ బాగా మిస్ ఫైర్ అయ్యాయి. అంతేకాదు, ఎన్టీఆర్ ఎనర్జీని కూడా అయాన్ సరిగా వాడుకోలేదు.

Also Read – Udayabhanu: అంతా స్క్రిప్టెడ్ – యాంక‌ర్లు చేసేదేం ఉండ‌దు – టీవీ షోస్ బండారం బ‌య‌ట‌పెట్టిన ఉద‌య‌భాను

బాలీవుడ్ లో తారక్ చేసిన మొదటి సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండాలని అనుకున్న అభిమానులకి గట్టి షాక్ తగిలింది. ఇంత నెగిటివిటీ వచ్చినప్పటికీ వార్ 2 తెలుగులో ఈ మాత్రం బజ్ క్రియేట్ అయిందంటే కచ్చితంగా అది మన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్లే. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ చేసిన పాత్రను మరో బాలీవుడ్ హీరో చేస్తే సౌత్ లో ఈ రేంజ్ చర్చలు జరిగేవి కానేకాదు. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఈ సినిమా ద్వారా ఒరిగిందేమీ లేదని చెప్పడానికి గ్యారెంటీగా దర్శకుడు అయాన్ ముఖర్జీనే కారణం.

బాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా కాబట్టి ఎన్టీఆర్ తో పాటు మన సినీ ఇండస్ట్రీ వాళ్ళు, అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఊహించని షాక్ అందరికీ తగిలింది. ఇక తారక్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ వార్ డ్రామా చేస్తున్నారు. టైటిల్ గా డ్రాగన్ ప్రచారం లో ఉంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా, కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 చేయాల్సి ఉంది.

Also Read – Kangana Ranaut Comments: సహజీవనం, డేటింగ్ యాప్స్ పై తీవ్ర విమర్శలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad