WAR 2 : వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఆరో చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అబ్డేట్ వచ్చేసింది. రేపటినుంచే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి
హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 2019లో రిలీజై విజయవంతమైన ‘వార్’ సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో హృతిక్ మేజర్ కబీర్ ధలివాల్‌గా, జూ. ఎన్టీఆర్ ఏజెంట్ విక్రమ్‌గా కనిపించనున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలతో ఈ చిత్రం ఆకట్టుకోనున్నట్లు సమాచారం.
అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి (ఆగస్టు 10, 2025) భారత్‌లో ఉన్న ప్రముఖ థియేటర్ చైన్స్‌లో ప్రారంభం కానున్నాయి. ఉత్తర అమెరికాలో ఇప్పటికే బుకింగ్స్ జోరందుకున్నాయి. ఇప్పటివరకు 3,30,000 డాలర్లు (సుమారు 2.8 కోట్ల రూపాయలు) వసూళ్లతో 580 లొకేషన్స్‌లో 5500 టికెట్లు అమ్ముడయినట్లు సమాచారం. తెలుగు వెర్షన్‌కు జూ. ఎన్టీఆర్ ఫ్యాన్‌బేస్ కారణంగా ఎక్కువ డిమాండ్ ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/mahesh-babu-net-worth-income-assets-2025/
హైదరాబాద్‌లో రేపు జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ చిత్రానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఇందులో హృతిక్-ఎన్టీఆర్ మధ్య డాన్స్ ఫేస్-ఆఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం స్పై యూనివర్స్‌లో భాగంగా, రాజీనాథ్ ‘కూలీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.
వార్ 2 రన్‌టైమ్ 3 గంటల 8 నిమిషాలు. ఇందులో హై-స్టేక్స్ ఎస్పియనేజ్, భావోద్వేగ కథాంశం మిళితమై ఉంటాయి. యూఎస్‌లో టికెట్ ధరలు హిందీ వెర్షన్‌కు 18 డాలర్లు, తెలుగు వెర్షన్‌కు 25 డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. భారత్‌లో టికెట్ ధరలు థియేటర్, లొకేషన్‌ను బట్టి మారుతాయి. ఇక ఈ సినిమా భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


