War 2 Pre Release Event: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న వార్ 2 మూవీ ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే టైమ్ ఉంది. కానీ ఇప్పటివరకు మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. హిందీతో పాటు తెలుగులో ఎలాంటి ఈవెంట్స్, ప్రెస్‌మీట్స్‌తో పాటు ఇంటర్వ్యూలను నిర్వహించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ఫ్యాన్స్ ట్రోల్…
తెలుగులో వార్ 2 మూవీని నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ప్రమోషన్స్ విషయంలో నాగవంశీ తీరును ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌నైనా నిర్వహిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే…
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్ వచ్చేసింది. వార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌తో పాటు వేదిక కూడా కన్ఫామ్ అయ్యింది. ఈ స్పై యాక్షన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్ట్ 10న హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు పోలీసుల నుంచి పర్మిషన్స్ లభించినట్లు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో తొలుత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పర్మిషన్ దొరకడం కష్టమనే వార్తలు వినిపించాయి. దాంతో ఈ ఈవెంట్‌ను ఏపీకి షిప్ట్ చేయచ్చంటూ వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో కొన్ని కండీషన్స్‌తో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు పోలీసులు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది.
రాజమౌళి గెస్ట్…
ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ అటెండ్ అవుతున్నాడు. ఇద్దరు హీరోలు ఒకే స్టేజ్‌పై కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. కాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజమౌళితో పాటు పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
వార్ సీక్వెల్…
వార్ 2 మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. 2019లో రిలీజైన వార్ సినిమాకు సీక్వెల్‌గా వార్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వార్ 2 తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. దాదాపు ఎనభై కోట్లకు సూర్యదేవర నాగవంశీ రైట్స్ దక్కించుకున్నారు. వార్ 2కు పోటీగా థియేటర్లలో రజనీకాంత్ కూలీ మూవీ రిలీజ్ అవుతోంది.
Also Read – Akhanda 2: పవన్ కి పోటీ..


