War 2 vs Coolie: మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్ వార్ 2 బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ ముగిసేలోగా వరల్డ్ వైడ్‌గా ఎన్టీఆర్ వార్ 2 మూవీ 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా రజనీకాంత్ కూలీ మూవీ 380 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది.
రికార్డులు అనుకుంటే…
బాక్సాఫీస్ రేసులో రజనీకాంత్ కూలీకంటే ఎన్టీఆర్ వార్ 2 వెనుకబడే ఉంది. ఫస్ట్ వీకెండ్‌లోగా ఈ మూవీ నాలుగు వందల కోట్ల వసూళ్లను రాబట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంచనా వేశారు. కానీ నెగెటివ్ టాక్ కారణంగా రెండు వందల యాభై కోట్లకే ఈ స్పై యాక్షన్ సినిమా పరిమితమైంది.
మూడో సినిమా…
ఆర్ఆర్ఆర్, దేవర తర్వాత వరల్డ్ వైడ్‌గా 250 కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఎన్టీఆర్ మూడో సినిమాగా వార్ 2 నిలిచింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ స్పై యాక్షన్ మూవీ భారీ నష్టాల దిశగా సాగుతోంది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఆదివారం నాటికి 38 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. వార్2 లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకా యాభై కోట్లకుపైనే కలెక్షన్స్ రావాల్సివుంది. సోమవారం నుంచి వార్ 2 కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ నేపథ్యంలో వార్ 2 తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడం అనుమానమేనని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read – Today Weather updates: తెలంగాణలో నేడు భారీ వర్షాలు..!
హీరోల ఇమేజ్…
ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ 2 మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కథ లేకుండా కేవలం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇమేజ్, యాక్షన్ అంశాలను నమ్ముకొని దర్శకనిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కించినట్లు విమర్శలు వస్తున్నాయి.
కూలీ రికార్డులు…
మరోవైపు రజనీకాంత్ కూలీ మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కథ విషయంలో నెగెటివ్ కామెంట్స్ వచ్చినా రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ బలంతో భారీగా వసూళ్లను రాబడుతోంది. వార్2కు డివైడ్ టాక్ రావడం కూడా కూలీకి కలిసొచ్చింది.
380 కోట్లు…
ఫస్ట్ వీకెండ్ ముగిసేలోగా వరల్డ్ వైడ్‌గా కూలీ మూవీ 380 కోట్లతో కుమ్మేసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్‌గా కూలీ మూవీకి 60 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు వెర్షన్‌కు ఏడు కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. తెలుగులో నాలుగు రోజుల్లో 53 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకొని బ్రేక్ ఈవెన్‌కు ఈ మూవీ చేరువైంది.
నాగార్జున విలన్…
కూలీ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దేవ అనే మాస్ క్యారెక్టర్‌లో రజనీకాంత్ కనిపించగా…సైమన్ అనే స్టెలిష్ విలన్‌గా నాగార్జున నటించాడు. కూలీలో శృతి హాసన్ ఓ కీలక పాత్ర చేసింది. అనిరుధ్ మ్యూజిక్ కూలీ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సోమవారం నుంచి కూలీ వసూళ్లు కూడా తగ్గుముఖం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. మండే టెస్ట్‌లో వార్ 2. కూలీ సినిమాల్లో ఏది పాస్ అవుతుంది అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read – Nda Needs jagan support: జగన్ మద్దతు కోరిన ప్రధాని మోదీ


