War 2 – Kingdom: ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా వార్ 2 రిలీజ్ కాబోతుంది. అదే రోజు రజనీకాంత్ కూలీ మూవీ కూడా విడుదల కానుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూలీ కంటే వార్ 2కే క్రేజ్ ఎక్కువగా ఉంది.
80 కోట్లకు…
వార్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు గట్టి పోటీ ఏర్పడింది. ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్, స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని అగ్ర నిర్మాణ సంస్థలు రైట్స్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. చివరకు 80 కోట్లకు సూర్యదేవర నాగవంశీ రైట్స్‌ను కొనేశాడు. తెలుగు డబ్బింగ్ మూవీస్‌లో ఇదే హయ్యెస్ట్ కావడం గమనార్హం.
Also Read – Health News: కుక్కర్‌లో వండి తింటున్నారా? ఇక ఒళ్లంతా విషమే!!
నైజాంలో రికార్డ్…
తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్‌గా వార్ 2 థియేట్రికల్ రైట్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వార్ 2 నైజాం థియేట్రికల్ హక్కులు 35 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ దేవర నైజాం బిజినెస్ 44 కోట్ల వరకు జరిగింది. స్ట్రెయిట్ మూవీ అయినా దేవరకు ఏ మాత్రం తగ్గకుండా డబ్బింగ్ మూవీ వార్ 2 బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కింగ్‌డమ్ తక్కువే…
సూర్య దేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన మరో మూవీ కింగ్‌డమ్ జూలై 31న రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్‌లో వార్ 2కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కింగ్‌డమ్ నైజాం బిజినెస్ 15 కోట్ల లోపే జరిగినట్లు చెబుతున్నారు. కింగ్‌డమ్‌కు కంటే వార్ 2 డబుల్ రేంజ్‌లో రేటు పలకడం ట్రేడ్ వర్గాలను షాకింగ్‌కు గురిచేసింది. ఎన్టీఆర్ క్రేజ్‌కు ఇది నిదర్శనమని అంటున్నారు. వార్ 2లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా… ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read – Malala Yousafzai: నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ గురించి ఆసక్తికర విషయాలు
డ్రాగన్…
వార్ 2తో పాటు ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌లో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. దేవర 2 కూడా కమిటయ్యాడు ఎన్టీఆర్.


