Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభToxic: టాక్సిక్ మూవీ నుంచి డైరెక్టర్ ని తప్పించారా..?

Toxic: టాక్సిక్ మూవీ నుంచి డైరెక్టర్ ని తప్పించారా..?

Toxic: కేజీఎఫ్ ఫ్రాంఛైజీస్ తో కన్నడ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరో యష్. కేజీఎఫ్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2 లతో పాన్ ఇండియా హీరోగా మారిన యష్ ఈ మూవీ మరో సీక్వెల్ లోనూ నటించబోతున్నాడు. రాకీభాయ్ గా బాక్సాఫీస్ వద్ద యష్ సృష్ఠించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ హీరో మరో క్రేజీ మూవీ టాక్సిక్ తో పాటు మైథలాజికల్ సిరీస్ రామాయణ లోనూ నటిస్తున్నాడు.

- Advertisement -

హిందీలో అత్యంత భారీగా రామాయణ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రాముడు సీత పాత్రల్లో నటిస్తుండగా, యష్ ఇందులో రావణ్ పాత్రలో అలరించబోతున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. రామాయణ పార్ట్ 1 2026 దీపావళి కానుకగా, పార్ట్ 2.. 2027 దీపావళి కానుకగా పాన్ వర్ల్డ్ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

Also Read – Dude Movie: డ్యూడ్ మూవీపై ఇళ‌య‌రాజా కేసు – సినిమా స్క్రీనింగ్ ఆపేస్తారా?

వీటికంటే ముందే యష్ నటిస్తున్న అత్యంత భారీ యాక్షన్ మూవీ టాక్సిక్ రిలీజ్ కావాల్సి ఉంది. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం మేరకు..ఈ క్రేజీ మూవీ నుంచి గీతూ మోహన్ దాస్ ని తప్పించారట. ఈమె మేకింగ్ స్టైల్ అండ్ టేకింగ్ హీరో యష్ కి సంతృప్తికరంగా లేదనే ఆమెని తప్పించినట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఆమె షూట్ చేసిన ఫుటేజీ యష్ కి నచ్చకపోవడంతో కొన్ని సీన్స్ మళ్ళీ రీ షూట్ కూడా చేశారట.

అయినా, గీతూ మోహన్ దాస్ మేకింగ్ తో యష్ శాటిస్ఫై కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెని తప్పించి స్వయంగా యష్ మెగా పట్టినట్టుగా కన్నడ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో మేకర్స్ నుంచి క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. ఈ వార్తలపై దర్శకురాలు గాని, యష్ టీమ్మ్ గానీ స్పందించి క్లారిటీ ఇస్తేగానీ, ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడుతుంది. కాగా, ఈ క్రేజీ మూవీలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, టొవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Also Read – Siddhu Jonnalagadda: అటకెక్కిన సిద్ధు సినిమా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad