కుంభమేళా (Kumbmela) స్పెషల్ అట్రాక్షన్ మోనాలిసా కొత్త లుక్ చూస్తే ఫిదా అయిపోతారు. ప్రయాగ్ రాజ్ లో తన కళ్లతో కైప్ ఎక్కించే ఈ 16 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 మూవీ పోస్టర్ ముందు నిల్చోని ఎల్లోడ్రెస్ లో కుర్రకారు మనసును దోచేస్తుంది. తన కళ్లతో మత్తేక్కించే ఈ మోనాలిసా ఎల్లో డ్రెస్సులో మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో నెటిజన్ల్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రోజు పోస్టర్ ముందు రేపు పోస్టర్ లోపల అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాలచక్రం అంటే ఇదేనేమో అని అంటారు. త్వరలోనే ముంబైలో కలుద్ధాం అంటూ మోనాలిసా ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ చిత్రంలో మోనాలిసా నటించనుంది. ఈ మధ్యకాలంలో దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసా ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ది డైరీ ఆఫ్ మణిపుర్’ సినిమాలో నటించేందుకు మోనాలిసా నుంచి అంగీకారపత్రంలో సంతకం తీసుకున్నారు. షూటింగ్ కి ముందు ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు.