Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత చిత్రం రెట్రో ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పూజాకి షాక్ తగిలింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రొటీన్ కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత సూర్య కరుప్పు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
అయితే, తాజా సమాచారం మేరకు కోలీవుడ్‌లో ఈ సంక్రాంతి పండుగ హీటెక్కనుంది. తమిళంలో రూపొందుతున్న సినిమాల మధ్య పోటీ ఉంటే ఆ కథ వేరుగా ఉంటుందని తమిళ ప్రేక్షకులు భావిస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటే వాళ్ల సినిమాల కోసం అభిమానులు బాక్సాఫీస్ వద్ద చేసే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే, ప్రతి పండుగ సీజన్ లాగానే, 2026 సంక్రాంతి బరిలో కూడా సౌత్ హీరోలు తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ, ఈ పోటీ వల్ల హిట్ కోసం చూస్తున్న హీరో సూర్యకు పెద్ద చిక్కొచ్చి పడింది.
Also Read- Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసులో నాపై తప్పుడు ప్రచారం చేశారు.. మీడియాపై మంచు లక్ష్మి ఫైర్..!
తమిళ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’. ఈ మధ్య హిట్స్ లేని సూర్య.. ఎలాగైనా ఈ మూవీతో హిట్ కొట్టి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఎంతో కష్టపడుతున్నారు. ఇందు కోసమే ‘కరుప్పు’ సినిమాను 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తే తన సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుందని ఆశ పడ్డారు. కానీ, మరో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జనవరి 9న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా మీద పూజా చాలా నమ్మకాలను పెట్టుకుంది.
ఇక, తాజాగా మరో స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమా ‘పరాశక్తి’. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఇది తనకి మొదటి తమిళ సినిమా. అధర్వ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు సుధ కొంగర నుంచి వచ్చిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో పరాశక్తి సినిమాపై ప్రారంభం నుంచే మంచి అంచనాలున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సూర్య సినిమాకి బెర్త్ లేకుండా పోయింది. మరి ఎంత పోటీనైనా తట్టుకోవడానికి రెడీ అని సూర్య బరిలోకి దిగుతారా లేదా చూద్దాం..
Also Read- Bigg Boss Day 5 Updates: కెప్టెన్ మాట వినలేదు కదా.. పర్యావసనాలు ఏంటో చెప్తా.. సంజనా వీర డైలాగులు


