Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభWho is Orry?: సెలబ్రిటీలతో రాసుకు- పూసుకు తిరిగే ఒర్రీ ఎవరు?

Who is Orry?: సెలబ్రిటీలతో రాసుకు- పూసుకు తిరిగే ఒర్రీ ఎవరు?

జాన్వీ, నైసా, దీపికా..ఇలా అందరి ఫోటోల్లోనూ కనిపించే ఒర్రీ ఎవరు?

ఒర్రీ.. ఎవరీ ఒర్రీ. సడన్ గా సెలబ్రిటీలతో కలిసి కనిపిస్తున్న సెలబ్రిటీ. ప్రతిపార్టీ, ప్రతి సెలబ్రేషన్, ప్రతి అకేషన్ లో ఒర్రీ లేని పార్టీ ఫోటోలు దాదాపు కనిపించటం లేదు. దీంతో ఈ ఒర్రీ ఎవరంటూ నెటిజన్లు ఒకటే ఆరా తీసే పరిస్థితి వచ్చింది. సెలబ్రిటీలందరితీ రాసుకు-పూసుకు తిరిగేంత సెలబ్రిటీ స్టేటస్ ఇతనికి రాత్రికి రాత్రి ఎలా వచ్చిందంటే అంతుచిక్కని పజిల్ మాత్రమే అని చెప్పక తప్పదు.

- Advertisement -

స్టార్స్, స్టార్ కిడ్స్ అందరి ఒళ్లో..

బాలీవుడ్ సెలబ్రిటీలు, వారి పిల్లలు, బిలయనీర్స్, పొలిటీషియన్స్ ఇలా అందరితోనూ పక్కనే తెగ చనువుగా కనిపించే విచిత్రమైన ఫ్యాషన్ స్టైల్ లో కనిపిస్తున్న ఇతని పేరు ఒర్రీ అంటే అసలు పేరు మాత్రం అర్హాన్ అవత్రామని అని కానీ సోషల్ మీడియా స్టార్ గా, బాలీవుడ్ నయా బీఎఫ్ఎఫ్ గా  ఇతన్ని అందరూ అఫిషియల్ గా పిలిచేస్తున్నారంటే ఇక ఒర్రీ ఏ రేంజ్ లో సడన్ గా ఎదిగాడని షాక్ అవుతుంది.

ఒక ఫోటోతో 30 లక్షలు మినిమం రిటర్న్స్!

గతంలో బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఒర్రీ ముంబైలోని హై ప్రొఫైల్ పార్టీలన్నింటిలోనూ తప్పకుండా ఉంటున్నాడు.  సెలబ్స్ తో ఫోటోలు అంటే సెల్ఫీలు తీసుకున్నందుకు ఒక పిక్ కు తనకు కనీసం వచ్చే ఆదాయం 20-30 లక్షలుమంటుందని, ఇలా ఫోటోలు తీసుకునేందుకు తనకు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిపడుతుందని అతను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు.  ఒక్క ఈవెంట్ కు ఒర్రీ అటెండ్ అయ్యేందుకు సుమారు 30 లక్షలు ఛార్జ్ చేస్తున్నట్టు బాలీవుడ్ లో తెగ చెప్పుకుంటున్నారు.

ఒర్రీ ప్రెజెన్స్ అట!

 సెలబ్రిటీలైతే జస్ట్ వస్తారు, పర్ఫామ్ చేస్తారు, వెళ్లిపోతారు.. కానీ తాను అలా కాదని పార్టీలోని ప్రతి ఒక్కరితో అతను మాట్లాడి, వారితో సెల్ఫీలు తీసుకుంటాడు. దీన్నే ‘ఒర్రీ ప్రెజెన్స్’ అంటూ మీడియాతో పెద్దఎత్తున గొప్పగా చెప్పుకోవటం ఒర్రీకి రొటీన్ గా మారింది.  అంతేకాదు తానెక్కడుంటే అక్కడికే జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు వచ్చి వాలిపోతారని అందుకే సెలబ్స్ కు తాను కావాలని చెబుతాడు.  ఇక పర్సనల్ ఫంక్షన్లు, ఫార్మ హౌజులకు తనను పిలిచేవారి సంఖ్య లెక్కకు మిక్కిలి అనే ఒర్రీ ఒర్రీ ప్రెజెన్స్ చాలని చాలామంది అనుకుని తనను ఇన్వైట్ చేసి, పే చేస్తున్నట్టు చెబుతుండటం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

అయామ్ ఎ లివర్

యాక్టర్ కానప్పటికీ బాలీవుడ్ సర్కిల్ లో సగానికిపైగా తనకు అత్యంత సన్నిహితులుగా ఉండేలా పలు అకేషన్స్ లో పిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్పర్సన్ ఆఫీస్ లో ఒర్రీ ఓ స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్..ఇది మీకు ఒర్రీ లింక్డ్ ఇన్ లో కనిపించే ప్రొఫైల్.  “అంతేకాదు నేను లివర్ ను ఎందుకంటే నేను యాక్టింగ్ చేయను బట్ ఐ జస్ట్ లివ్ సో అయామ్ లివర్” అనే ఒర్రీ మాటలు మనకు ఏమాత్రం అర్థం కావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News