Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBalakrishna: బాల‌కృష్ణతో హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు ప్రొడ్యూస‌ర్ బాలీవుడ్ మూవీ - అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయిన ఆ సినిమా...

Balakrishna: బాల‌కృష్ణతో హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు ప్రొడ్యూస‌ర్ బాలీవుడ్ మూవీ – అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయిన ఆ సినిమా ఏదంటే?

Balakrishna: పాన్ ఇండియ‌న్ ట్రెండ్ కార‌ణంగా టాలీవుడ్ హీరోల‌కు త‌మిళం, బాలీవుడ్‌తో పాటు ఇత‌ర భాష‌ల్లో క్రేజ్ పెరుగుతోంది. అల్లు అర్జున్‌, ప్ర‌భాస్, విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి తెలుగు హీరోల సినిమాలు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రెయిట్ మూవీస్‌కు ధీటుగా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్నాయి. పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్ మొద‌లు కాక‌ముందే చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి వారు బాలీవుడ్‌లో సినిమాలు చేశారు.

- Advertisement -

హిందీలో మూడు సినిమాలు…
వెంక‌టేష్ అనారి బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. హిందీలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌తిబంధ్‌, ఆజ్ కా గుండారాజ్‌తో పాటు ది జెంటిల్‌మెన్ సినిమాలు చేశారు. నాగార్జున బాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్నారు. ఇప్ప‌టికీ సినిమాలు చేస్తున్నారు. కానీ బాల‌కృష్ణ మాత్రం తెలుగులో మిన‌హా ఇప్ప‌టివ‌ర‌కు ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేయ‌లేదు.

Also Read – 2025 Renault Triber: కొత్త రెనాల్ట్‌ ట్రైబర్‌ వచ్చేసింది.. చాలా తక్కువ ధరకే మంచి 7 సీటర్‌!

ఏఎమ్ ర‌త్నం నిర్మాణంలో…
1992 టైమ్‌లో బాల‌కృష్ణ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాల్సింది. హీరోయిన్‌, డైరెక్ట‌ర్ ఫిక్స‌యిన త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయింది. బాలీవుడ్ డెబ్యూ మూవీని హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు ప్రొడ్యూసర్ ఏఎమ్ ర‌త్నం నిర్మించాల్సింది. తేజాబ్‌, అంకుష్‌, న‌ర‌సింహా వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఫామ్‌లో ఉన్న ఎన్ చంద్ర ద‌ర్శ‌కుడిగా ఖ‌రారు అయ్యాడు.

మాధురీ దీక్షిత్ హీరోయిన్‌…
ఈ హిందీ మూవీలో బాల‌కృష్ణ‌కు జోడీగా మాధురీ దీక్షిత్‌ను హీరోయిన్‌గా ఎంపిక‌ చేశారు. డేట్స్ స‌ర్ధుబాటు కాక తొలుత ఈ సినిమాలో న‌టించ‌డానికి మాధురీ దీక్షిత్ అంగీక‌రించ‌లేదు. తేజాబ్‌తో బాలీవుడ్‌లో త‌న‌కు స్టార్‌డ‌మ్‌ను తీసుకొచ్చిన ఎన్ చంద్ర ఈ మూవీకి డైరెక్ట‌ర్ కావ‌డంతో అత‌డి కోసం బాల‌కృష్ణ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది మాధురీ దీక్షిత్‌. తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమాను నిర్మించాల‌ని ఏఎమ్ ర‌త్నం ప్లాన్ చేశారు.

షూటింగ్ డిలే…
బాల‌కృష్ణ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు డైరెక్ట‌ర్‌ ఎన్ చంద్ర‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసి షూటింగ్‌ మొద‌లుపెట్టాల‌ని అనుకున్నారు. ఎన్‌ చంద్ర‌తో పాటు బాల‌కృష్ణ‌, మాధురీ దీక్షిత్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో సినిమా సెట్స్‌పైకి రావ‌డం డిలే అయ్యింది. ఆ త‌ర్వాత బాల‌కృష్ణ హిందీలో న‌టించ‌డానికి అంత‌గా ఇంట్రెస్ట్ చూప‌క‌పోవ‌డంతో సినిమా ఆగిపోయింది. బాల‌కృష్ణ బాలీవుడ్ డెబ్యూ మూవీ స్థానంలో క‌ర్త‌వ్వం సినిమాను తేజ‌స్విని పేరుతో ఎన్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేశారు ఏఎమ్‌ర‌త్నం.

Also Read – Jobs in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad