Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRashmika Mandanna: స‌గం షూటింగ్ కంప్లీట్ - టైటిల్ ఫిక్స్ - అనుకోకుండా మ‌ధ్య‌లోనే ఆగిపోయిన...

Rashmika Mandanna: స‌గం షూటింగ్ కంప్లీట్ – టైటిల్ ఫిక్స్ – అనుకోకుండా మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ర‌ష్మిక తెలుగు మూవీ ఏదో తెలుసా!

Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న టైమ్ మామూలుగా లేదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ర‌ష్మిక న‌టిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్, హిస్టారిక‌ల్‌.. జాన‌ర్ ఏదైనా ర‌ష్మిక న‌టిస్తే ఆ సినిమా హిట్టే అనే ముద్ర‌ప‌డిపోయింది. బాలీవుడ్‌లో యానిమ‌ల్‌, ఛావా సినిమాల‌తో పెద్ద విజ‌యాల‌ను అందుకున్న‌ది ఈ నేష‌న‌ల్ క్ర‌ష్‌. తెలుగులో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించిన పుష్ప మూవీ ఏకంగా 1800 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. కుబేర కూడా మంచి హిట్‌గా నిలిచింది.

- Advertisement -

లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై…
ఈ స‌క్సెస్‌ల‌తో హీరోయిన్‌గా క‌థ‌ల ఎంపిక‌లో త‌న రూట్ మార్చింది ర‌ష్మిక మంద‌న్న‌. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పై ఫోక‌స్ పెడుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో పాటు మైసా సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

రెయిన్ బో పేరుతో…
వీటి కంటే ముందే తెలుగులో ర‌ష్మిక మంద‌న్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ అంగీక‌రించింది. స‌గం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఆ సినిమా ఆగిపోయింది. రెయిన్‌బో పేరుతో మొద‌లైన ఈ సినిమాకు శాంత‌రూబ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

Also Read- Google: ఏపీ వాసులకు అదిరిపోయే శుభవార్త.. విశాఖలో గూగుల్ గ్రీన్ సిగ్నల్..!

శాకుంత‌లం హీరో…
రెయిన్‌బో మూవీలో ర‌ష్మిక మంద‌న్న‌కు జోడీగా శాకుంత‌లం ఫేమ్ దేవ్ మోహ‌న్ హీరోగా న‌టించాడు. రెయిన్‌బో ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఓ షెడ్యూల్ షూటింగ్ జ‌రిగింది. కొడైకెనాల్‌తో పాటు త‌మిళ‌నాడులోని కొన్ని లోకేష‌న్స్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. సెకండ్ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు అనుకున్నారు.

డియ‌ర్ కామ్రేడ్ ఫేమ్‌…
కానీ నిర్మాత‌ల‌తో ద‌ర్శ‌కుడికి ఏర్ప‌డిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా మ‌ధ్య‌లోనే రెయిన్‌బో మూవీ ఆగిపోయింది. ఈ సినిమాకు డియ‌ర్ కామ్రేడ్ ఫేమ్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ మ్యూజిక్ అందించాడు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ బంగ్లాన్ ప‌నిచేశారు. ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్ కెరీర్‌లో మ‌ధ్య‌లోనే ఆగిపోయిన సినిమా ఇదొక్క‌టే కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read- Prabhas: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రాజాసాబ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్‌పై ప్రొడ్యూస‌ర్ క్లారిటీ!

ప్ర‌స్తుతం ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ది గ‌ర్ల్‌ఫ్రెండ్ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాకు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మైసా మూవీ ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ర‌వీంద్ర పుల్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో యాక్ష‌న్ రోల్‌లో ర‌ష్మిక క‌నిపించ‌బోతున్న‌ది. హిందీలో థామా పేరుతో హార‌ర్ మూవీ చేస్తోంది ర‌ష్మిక‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad