Friday, June 20, 2025
Homeచిత్ర ప్రభWar 2: ఎన్టీఆర్ ఆగ‌స్ట్ హిట్ సెంటిమెంట్‌.. రిపీటయ్యేనా!

War 2: ఎన్టీఆర్ ఆగ‌స్ట్ హిట్ సెంటిమెంట్‌.. రిపీటయ్యేనా!

Jr NTR: ఎన్‌టిర్ ట్రిపులార్ తర్వాత పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆస్కార్ కూడా అందుకున్నారు. అప్పటి నుంచి యంగ్ టైగర్‌తో సినిమా అంటే అది పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన దేవర మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ కూడా చేయబోతున్నారు కొరటాల-తారక్. అయితే, ట్రిపులార్ తర్వాత దేవర తో పాటుగా తారక్ బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి అక్కడ వార్ 2 సినిమాను పూర్తి చేశారు.

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న వార్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరి మధ్య వచ్చే హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళతాయని మేకర్స్ చెప్తున్నారు. అంతేకాదు, ఎన్‌టిర్ స్టామినాకి వార్ 2 మూవీ పర్ఫెక్ట్ అని ఎంతో కాన్‌ఫిడెంట్‌గా చెప్పుకుంటున్నారు. గత నెల తారక్ బర్త్ డే సందర్భంగా వదిలిన టీజర్ హైప్ ఓ రేంజ్‌లో క్రియేట్ చేసింది. అయితే, వార్2 రిలీజ్ డేట్ విషయంలో ఓ లాజిక్ ఉందని ప్రస్తుతం ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తారక్‌తో మూడు సినిమాలు తీసి హ్యాట్రిక్ హిట్ ఇచ్చారు. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ. ఈ మూడు సినిమాలలో తారక్ పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పాల్సిందే. ముఖ్యంగా ఎన్‌టిర్ సన్నబడిన తర్వాత చేసిన యమదొంగ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యముడిగా ఆయన అలరించిన విధానం అందరినీ మెస్మరైజ్ చేసింది. అయితే, ఈ సినిమా రిలీజ్ రోజుకి ఒక్కరోజు ముందు వార్ 2 రిలీజ్ డేట్ లాకైంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/nagarjuna-dhanush-rashmika-kubera-movie-review/

ఇది యాదృఛ్చికంగా జరిగినా ఓ సెంటిమెంట్ అనిపిస్తోంది. 2007 ఆగస్టు 15న యమదొంగ రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. ఇప్పుడు తారక్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ చేసిన వార్ 2 ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దాంతో యమదొంగ సక్సెస్‌తో వార్ 2 సక్సెస్ అండ్ రికార్డ్స్‌ని పోల్చుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇన్ని వందల కోట్లు పక్కా అని లెక్కలేసుకుంటున్నారు. మరి తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఫస్ట్ మూవీ ఎలాంటి సెన్షేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇక ఇదే ఆగస్ట్ 14న కోలీవుడ్ సీనియర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి బిగ్ స్టార్స్ ఉన్నారు. మొత్తానికి ఈ ఏడాది ఆగస్ట్ 14న బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీనే రాబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News