Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ వన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 12 రోజుల్లో 675 కోట్ల కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. విక్కీ కౌశల్ ఛావా తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ మూవీగా కాంతార చాఫ్టర్ వన్ రికార్డును క్రియేట్ చేసింది. కన్నడంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ అదరగొడుతోంది. హిందీ వెర్షన్ మంగళవారం నాటితో 150 కోట్ల మైలురాయిని టచ్ చేసింది. తెలుగులోనూ యాభై కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకుంది.
ఓవర్‌సీస్‌లో మాత్రం…
ఇండియాలో కాసుల వర్షం కురిపిస్తున్న కాంతార చాప్టర్ వన్‌కు ఓవర్‌సీస్‌లో మాత్రం గట్టి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఓవర్‌సీస్‌లో దాదాపు 15 మిలియన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. 12 రోజుల్లో ఓవర్‌సీస్‌లో ఈ మూవీకి పది మిలియన్లు అంటే 97 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా ఓవర్‌సీస్‌లో ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ కావాలంటే మరో ఐదు మిలియన్ల వసూళ్లు రావాలి. సుమారు యాభై కోట్లకుపైనే కలెక్షన్స్ రావాలన్నమాట. ఇప్పటికే రోజురోజుకు కలెక్షన్స్ తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో ఓవర్‌సీస్‌లో కాంతార చాప్టర్ వన్ బ్రేక్ ఈవెన్ కావడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.
Also Read- Ravi Teja: మాస్ మహారాజా తగ్గేదేలే – మరో సినిమాకు రవితేజ గ్రీన్‌సిగ్నల్ – డైరెక్టర్ ఎవరంటే?
అమెరికాలో నష్టాలు?
ముఖ్యంగా అమెరికాలో కాంతార చాప్టర్ వన్ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో నార్త్, సౌత్ కలిపి ఎనిమిది మిలియన్ల వరకు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిలో సగం అంటే నాలుగు మిలియన్ల వరకు మాత్రమే వెనక్కి రాబట్టింది. ఇంకో నాలుగు మిలియన్లు రావడం అసాధ్యమేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపావళికి తెలుగుతో పాటు తమిళంలో చాలానే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి ఎఫెక్ట్ కాంతార చాప్టర్ వన్ కలెక్షన్స్‌పై పడే అవకాశం కనిపిస్తోంది.
డైరెక్టర్ కమ్ హీరో…
కాంతార చాప్టర్ వన్ మూవీలో హీరోగా నటిస్తూనే ఈ మూవీకి దర్శకత్వం వహించాడు రిషబ్ శెట్టి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌లో హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. కాంతార చాప్టర్ వన్‌లో రిషబ్ శెట్టి యాక్టింగ్‌తోపాటు అతడి టేకింగ్ అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాంతారకు సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు రిషబ్ శెట్టి ప్రకటించాడు.
Also Read- Ravi Teja: సినిమాల్లోకి రవితేజ కూతురు ఎంట్రీ – హీరోయిన్‌గా కాదండోయ్!


