Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభBalakrishna: ఈసారైనా సీక్వెల్ కలిసొస్తుందా..?

Balakrishna: ఈసారైనా సీక్వెల్ కలిసొస్తుందా..?

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2: తాండవం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అఖండకి సీక్వెల్ గా వస్తోంది. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ హిట్స్ సాధించి ఉండటంతో ఇప్పుడు రూపొందుతున్న అఖండ 2 మీద భారీ అంచనాలున్నాయి. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకి సీక్వెల్స్ సెట్ అవలేదు. పార్ట్ 1 భారీ హిట్ సాధించినప్పటికీ సీక్వెల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.

- Advertisement -

ఇప్పుడు ఇదే టాక్ బాలకృష్ణ విషయంలో రిపీటవుతుందా..? అని మాట్లాడుకుంటున్నారు. బాలకృష్ణ 2019 లో ఆయన తండ్రి, నందమూరి తారక రామారావు జీవిత కథ అధారంగా యన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించారు. యన్టీఆర్ కథానాయకుడు, యన్టీఆర్ మహానాయకుడు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. రెండు భాగాలు అటు బాలయ్యని, ఇటు నందమూరి అభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాయి. అప్పటి నుంచి మళ్ళీ బాలయ్య సీక్వెల్ మూవీ ఏదీ చేయలేదు.

Also Read – Ravi Teja: సినిమాల్లోకి ర‌వితేజ కూతురు ఎంట్రీ – హీరోయిన్‌గా కాదండోయ్‌!

మళ్ళీ ఇన్నాళ్ళకి అఖండ చిత్రానికి సీక్వెల్ గా అఖండ 2: తాండవంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఊహించని స్థాయిలో లేదనే మాట గట్టిగా వినిపించింది. ముఖ్యంగా టీజర్ లో ఉన్న గ్రాఫిక్స్ బాగోలేవనే మాట వినిపిస్తోంది. బాలయ్య త్రిశూలం మెడ చుట్టూ తిప్పుతూ శత్రువులను చంపే సీన్ కాస్త రియాలిటీకి దూరంగా ఉందనిపించింది. చాలామంది ఇదే మాటను అన్నారు కూడా. ఒకవేళ అఖండ 2 గనక వస్తే ఇందులో ఉన్న వీఎఫెక్స్ వర్క్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు.

సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి కూడా కారణం ఈ వీఎఫెక్స్ వర్కే. అందుకే సెప్టెంబర్ లో రిలీజ్ అనుకున్న అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అది కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బాలయ్యకి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2: తాండవం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. కాగా, ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు.

Also Read – FASTag :ఫోటో తీసి పంపిస్తే చాలు రూ. 1,000 గిఫ్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad