Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభNani: 2026 లో ‘2’.. అయ్యే పనేనా..!

Nani: 2026 లో ‘2’.. అయ్యే పనేనా..!

Nani: తెలుగులో ఉన్న మిడ్ రేంజ్ హీరోలలో నానికి ఉన్న క్రేజ్ వేరే లెవల్. చెప్పాలంటే, ఇప్పుడు నాని పాన్ ఇండియా స్టార్. ఆయన నిర్మాతగా కూడా మంచి కథలను తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. కోర్ట్ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు నానీని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సెన్సిటివ్ పాయింట్ ని హ్యూమన్ ఎమోషన్స్ తో తీసిన ఈ సినిమా.. ఎక్కువ భాగం మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కే బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా నానీకి నిర్మాతగా మంచి సక్సెస్‌ని ఇచ్చింది.

- Advertisement -

ఇక, నాని హీరోగా ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలలో ఎక్కువగా మాస్ ఆడియన్స్‌ని, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే రూపొందిస్తున్నారు. ‘దసరా’ సినిమా నుంచి నానీ ఎక్కువగా కల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నారు. ఇలాంటి సినిమాలకి మన తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషలలో ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. ఇక ఉగ్రం, కేజీఎఫ్ ఫ్రాంఛైజ్, కాంతార సినిమాలు వచ్చిన తర్వాత కన్నడలో కూడా విలేజ్ బ్యాగ్డ్రాప్, పుష్ప లాంటి ఐకానిక్ సినిమాలకి విపరీతంగా ఆదరణ లభిస్తోంది.

Also Read- Coolie OTT: ఓటీటీలోకి ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘కూలీ’ – స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఇవే!

ఇక, బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతకొంతకాలంగా మన తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకే, నానీ పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి కథలను యూనిక్‌గా ఎంచుకుంటున్నారు. హిట్ 3 తర్వాత చేస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండవ సినిమా కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. దానికితోడు కాన్సెప్ట్ పోస్టర్, గ్లింప్స్ మరీ అరాచకం అనిపించడం కూడా ప్యారడైజ్ సినిమాపై ఆసక్తిని రేపింది. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

ఇక, నాని హీరోగా నెక్స్ట్ సినిమా సుజీత్ దర్శకత్వంలో ఉండబోతోంది. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ డైరెక్టర్, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఓజీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఊహించనంతగా ఉన్నాయి. దీని తర్వాత నానితో సినిమా ఉండబోతుంది. నాని, సుజీత్ ల ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే, 2026 లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది నాని నుంచి రెండు సినిమాలు రావడం అంటే అయ్యే పనేనా..! అని చిన్న సందేహం కూడా ఉంది. చూడాలి మరి ఇది ఎంతవరకూ సాధ్యపడుతుందో.

Also Read- The Paradise: పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా నాని ది ప్యార‌డైజ్ – హాలీవుడ్ సంస్థ‌తో డీల్ – రంగంలోకి అవ‌తార్ ప్ర‌మోష‌న్స్‌ టీమ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad