Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభVenu Swamy | వేణుస్వామికి బిగ్ షాక్.. చర్యలకి కోర్టు ఆదేశాలు

Venu Swamy | వేణుస్వామికి బిగ్ షాక్.. చర్యలకి కోర్టు ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద జ్యోతిష్యుడిగా ఫేమస్ అయ్యారు వేణుస్వామి (Venu Swamy). సినీ తారలు, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఈయన శుభం కంటే అశుభాలే ఎక్కువగా చెబుతుంటారు. ఇండస్ట్రీ కపుల్స్ విడిపోతారని, స్టార్ హీరో చనిపోతారంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. కోఇన్సిడెన్సో ఏంటో తెలియదుగానీ సమంత, నాగచైతన్య విషయంలో ఈయన చెప్పింది నిజమైంది. దీంతో నెట్టింట ఆయన సెన్సేషన్ గా మారిపోయారు. సెలెబ్రిటీల జాతకం చెప్పడంలో తాను స్పెషలిస్ట్ అనే ముద్ర వేయించేసుకున్నారు.

- Advertisement -

ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా వేణుస్వామి (Venu Swamy) చాలా విశ్లేషణలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారన్నారు. ఏపీలో జగనే మళ్ళీ సీఎం అవుతారని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ రెండు చోట్లా సీన్ రివర్స్ అయింది. దీంతో నెటిజెన్లు వేణుస్వామిపై విపరీతమైన ట్రోల్స్ చేశారు. ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. దెబ్బకి ఇక నేను సినీ, రాజకీయ జ్యోతిష్యం చెప్పనంటూ బై బై చెప్పేశారు వేణుస్వామి. కానీ, నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అవగానే సడెన్ గా మళ్ళీ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యారు. బోర్డు పెట్టేసి కుండలి వేసి ఇద్దరి జాతకాలు విశ్లేషించారు. చివరికి వీళ్లిద్దరు కూడా విడిపోతారు, శోభిత జాతకం అసలు బాగోలేదని వీడియో వదిలారు.

Also Read : భయపెడుతున్న అనుష్క..

దీంతో ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ మహిళా కమిషన్ ని ఆశ్రయించారు. వేణుస్వామికి కళ్లెం వేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద వేణుస్వామికి నోటీసులు పంపారు. విచారణకి హాజరవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మొదటి నోటీసుకు హాజరుకాకుండా వేణుస్వామి కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చింది. స్టే ఎత్తివేస్తూ వారంలోపు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసి వేణుస్వామికి షాకిచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News