Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDacoit: రాకింగ్ స్టార్ యష్ వర్సెస్ అడివి శేష్... ఉగాది బాక్సాఫీస్ పోరు!

Dacoit: రాకింగ్ స్టార్ యష్ వర్సెస్ అడివి శేష్… ఉగాది బాక్సాఫీస్ పోరు!

‘టాక్సిక్’ vs ‘డెకాయిట్’

- Advertisement -

Dacoit: 2026 ఉగాది పండుగ రోజున (మార్చి 19, 2026) రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఈ క్లాష్‌తో ఆడియన్స్ లో హైప్ అమాంతం పెరిగింది. ‘కేజీఎఫ్’ తో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న యష్ నెక్స్ట్ మూవీ ‘టాక్సిక్’ గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 19, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/star-heroes-sons-struggles-in-film-industry/

ఇక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అడివి శేష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘డెకాయిట్’. ఈ సినిమా కూడా అదే ఉగాది రోజు (మార్చి 19, 2026)న విడుదల కాబోతుంది. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా డేట్ వాయిదా పడి యష్‌ సినిమాతో క్లాష్ అవుతుండడం విశేషం. యష్ పాన్ ఇండియా స్టార్‌డమ్, అడివి శేష్ పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌కు మధ్య పోరు ఎలా ఉంటుందో చూడాలి.

ఉగాదికి ‘టాక్సిక్’తో సందడి చేయనున్న యష్, అదే ఏడాది చివర్లో మరింత పెద్ద ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూ. 4000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణ’ లో యష్ రావణుడి రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి రిలీజ్ కాబోతుంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఒకే ఏడాదిలో రెండు భారీ ప్రాజెక్టులతో, ఒకటి హీరోగా మరొకటి విలన్ గా రావడం యష్ కెరీర్‌ని ఎక్కడ వరుకు తీసుకు వెళ్తుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad