Ambati Rambabu: హరిహర వీరమల్లు మూవీ హిట్టవ్వాలంటూ వైసీఎపీ నేత అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జూలై 24న (గురువారం) రిలీజ్ కాబోతుంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఫస్ట్ టైమ్ ప్రమోషన్స్‌లో…
ఏపీ ఎలెక్షన్స్ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కోసం సినిమా మీడియా ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఈ ప్రమోషన్స్‌లో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తాను సినిమాలు చేస్తేనో లేదో తెలియదని, ఇండస్ట్రీకి మాత్రం దూరం కానని, ప్రొడ్యూసర్‌గానైనా సినిమాలు చేస్తానని అన్నారు.
Also Read – Suriya Karuppu Teaser: రుద్రుడై వచ్చే దేవుడు.. యాక్షన్ రోల్‌లో సూర్య
రెమ్యూనరేషన్ లేకుండా…
ప్రొడ్యూసర్ క్షేమాన్ని దృష్టిలో రెమ్యూనరేషన్ తీసుకోకుండా హరిహర వీరమల్లు సినిమా చేసినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సూపర్ డూపర్ హిట్టై…
కాగా హరిహర వీరమల్లు మూవీని ఉద్దేశించి వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌ను వ్యతిరేకతిస్తూ వస్తోన్న అంబటి రాంబాబు సినిమాపై మాత్రం పాజిటివ్ ట్వీట్ వేశారు. “పవన్ కళ్యాణ్ గారి హరిహరవీరమల్లు సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను” అంటూ బుధవారం ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. తన ట్వీట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు.. నాగబాబు పేర్లను జోడించారు. అంబటి రాంబాబు ట్వీట్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నది మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులకు అంతు పట్టడం లేదు. హరిహర వీరమల్లు సినిమా చూసి రివ్యూ కూడా ఇవ్వండి అంటూ అంబటి రాంబాబు ట్వీట్‌ను ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.
శ్యాంబాబు రోల్…
2023లో రిలీజైన పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన శ్యాంబాబు పాత్ర అంబటి రాంబాబును పోలి ఉందంటూ అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. తనను కించపరచడానికే పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారంటూ అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ను ఏదో ఒక రూపంలో విమర్శిస్తూ వస్తోన్న అంబటి రాంబాబు హరిహర వీరమల్లు మూవీపై మాత్రం పాజిటివ్ ట్వీట్ చేయడం అభిమానులను షాక్‌కు గురిచేస్తుంది. రిలీజ్ తర్వాత కూడా హరిహర వీరమల్లుపై అంబటి రాంబాబు మరికొన్ని ట్వీట్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read – Tanushree Dutt Viral Video: వేధిస్తున్నారంటూ తనుశ్రీ దత్తా ఆవేదన.. సహాయం కావాలంటూ కన్నీళ్లు!
నిధి అగర్వాల్ హీరోయిన్…
హరిహర వీరమల్లు మూవీకి క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఏఎమ్‌రత్నం ఈ సినిమాను నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.


