Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభTunisha : షూటింగ్ స్పాట్‌లో యువ నటి ఆత్మహత్య..

Tunisha : షూటింగ్ స్పాట్‌లో యువ నటి ఆత్మహత్య..

- Advertisement -

Tunisha : బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి తునిష ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ లో చర్చగా మారింది. ‘భారత్‌ కా వీర్‌ పుత్ర’ అనే సీరియల్‌తో 13 ఏళ్లకే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తునిష ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కూడా పలు సీరియల్స్ తో బిజీగా ఉంది. ఒకపక్క సీరియల్స్ చేస్తూనే సినిమాల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది తునిష.

శనివారం నాడు ఓ షూటింగ్ సెట్ లో బ్రేక్ టైంలో తన సహా నటుడి మేకప్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో సీరియల్ యూనిట్ తలుపు బద్దలు కొట్టి లోపలి వెళ్లగా తునిష అక్కడ విగతజీవిగా పడి ఉంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లినా ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు.

మరో పది రోజుల్లోనే తునిష 21వ పుట్టిన రోజు వేడుక చేసుకుందామని ప్లాన్ చేసుకుంది అలాంటిదే ఇలా 20 ఏళ్లకే సూసైడ్ చేసుకొని మరణించడం అందర్నీ బాధపెడుతోంది. తునిష ఎందుకు ఆత్మహత్య చేసుకుందని ఎవరికీ తెలీదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News