Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభTollywood Heroes: డిసెంబర్‌లో సంద‌డి చేయ‌నున్న యంగ్ హీరోస్‌..

Tollywood Heroes: డిసెంబర్‌లో సంద‌డి చేయ‌నున్న యంగ్ హీరోస్‌..

Tollywood Heroes: టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల హంగామా కొంచెం నెమ్మదించిన నేపథ్యంలో యంగ్ హీరోలు మాత్రం తమ ఎనర్జీని మరింతగా పెంచుకుంటున్నారు. పెద్ద హీరోల గ్యాప్‌ను సద్వినియోగం చేసుకుంటూ యంగ్ హీరోస్ కొత్త కథలు, విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. రానున్న నెలల్లో విడుదలకు సిద్ధమైన ఈ యంగ్ హీరోల సినిమాలకు సంబంధిచిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

- Advertisement -

కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తోన్న శర్వానంద్ బైకర్ సినిమాతో రాబోతున్నారు. తన ఇమేజ్‌కు భిన్నంగా కొత్త లుక్‌తో ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ‘బైకర్’ ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో శర్వా తొలిసారిగా సిక్స్‌ప్యాక్ లుక్‌లో కనిపించనుండడం ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. టీజర్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా సినిమా రిలీజ్‌కు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’. ఈ సినిమా గురించి చెప్పుకుంటే.. ఇది ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం రూపొందిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌ ద్వారా మంచి స్పందన పొందిన ఈ చిత్రం రోషన్‌కి సాలిడ్ లాంచ్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read – The Girl Friend: ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పరమ వేస్ట్! ‘ది గర్ల్ ఫ్రెండ్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

మరో హీరో ఆది సాయికుమార్ విషయానికి వస్తే.. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘శంబాల’ పూర్తిగా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. మిస్టికల్ ఎలిమెంట్స్, యాక్షన్, ఎమోషన్‌ల మిశ్రమంగా రూపొందిన ఈ మూవీ కూడా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఆది కెరీర్‌లో ఇది కీలక చిత్రం అవుతుందని అనుకుంటున్నారు.

మొత్తానికి టాలీవుడ్‌లో కొత్త తరహా కంటెంట్‌తో ముందుకు వస్తున్న ఈ యంగ్ హీరోలు, స్టార్ హీరోల గ్యాప్‌ను ఫుల్‌గా ఉపయోగించుకుంటూ తమ మార్క్‌ను క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఛాంపియన్’, ‘శంబాల’, ‘బైకర్’.. ఈ మూడు సినిమాలు డిసెంబర్ నెలను యువ హీరోల మధ్య పోటీగా మార్చేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో దూసుకెళ్తాయో చూడాలి మరి.

Also Read – Adheera: ఈసారైనా సాక్షి వైద్య‌కి వ‌ర్క‌వుట్ అవుతుందా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad