Saturday, March 1, 2025
Homeచిత్ర ప్రభDhee Dancer: ‘ఢీ’షో డ్యాన్సర్ మోసం.. యువతి ఆత్మహత్య

Dhee Dancer: ‘ఢీ’షో డ్యాన్సర్ మోసం.. యువతి ఆత్మహత్య

ప్రముఖ డ్యాన్స్ ప్రోగ్రామ్ ‘ఢీ'(Dhee) షో తెలుగు రాష్ట్రాలో ఎంతో పాపులర్ అయింది. అనామకులైన వ్యక్తులను టాప్ కొరియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది. అలాంటి షో అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఢీ షోకు చెందిన ఓ డ్యాన్సర్ మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో కావ్య కళ్యాణి(24) అనే యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి కారణం ఢీ షో డాన్సర్ అభి అంటూ సెల్ఫీ వీడియోలో తెలిపింది.

- Advertisement -

“నాకు న్యాయం జరగాలి. నేను చనిపోతున్నాను. నా చావుకి కారణం అభి. 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడు నన్ను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు” అని వాపోయింది. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News