Zakir Hussain: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (Zakir Hussain) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు.
- Advertisement -
1990లో సంగీత్‌నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలు భారత ప్రభుత్వం నుంచి స్వీకరించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖలు సంతాపం తెలియజేస్తున్నారు.