Thursday, November 21, 2024
Homeనేరాలు-ఘోరాలుKukatpally | కూకట్‌పల్లిలో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్

Kukatpally | కూకట్‌పల్లిలో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్

కూకట్‌పల్లి (Kukatpally) లో ఇద్దరు విద్యార్థినుల మిస్సింగ్ వార్త కలవరం రేపుతోంది. ఉదయం స్కూలుకి వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి అదృశ్యం అవడం తల్లిదండ్రులను ఆందోళనకి గురి చేస్తోంది. దీంతో తమ పిల్లల ఆచూకీ కోసం పోలీసులని ఆశ్రయించారు. కేసుకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో హారిక (14), లక్ష్మీ దుర్గ (13) అనే ఇద్దరు విద్యార్థినులు 8వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు వదిలి తిరిగి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లారు. కానీ, తమ పిల్లలు కానరాకపోవడంతో స్కూల్ టీచర్, ప్రిన్సిపాల్ ను సంప్రదించారు. వారు స్కూల్ నుంచి ఇప్పుడే వెళ్లిపోయారని చెప్పడంతో… చుట్టుపక్కల వెతికి, ఎంతసేపటికి కనిపించకపోవడంతో కూకట్‌పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News