Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుVeldurthi: ఎండిన పంటలు, నిండా మునిగిన రైతులు

Veldurthi: ఎండిన పంటలు, నిండా మునిగిన రైతులు

కరువు సహాయక చర్యలు తక్షణం ప్రారంభించాల్సిందే

వెల్డుర్తి మండలంలో వర్షాలు లేక పొలాల్లో పంటలు ఎండిపోయి ఆందోళనలో రైతులున్నారు. ఈ సంవత్సరం విత్తనాలు పొలంలో వేసినప్పటి నుంచి వర్షం లేదు. పంటలు ఎండిపోయి, రైతు పెట్టిన ఖర్చు ఒక్క రూపాయి కూడా వెనక్కు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రైతు ఉన్న డబ్బులు ఖర్చు చేసి అప్పులు చేసిన వీరు ఇప్పుడు తినడానికి తిండి గింజలు కూడా కొనలేని దుస్థితిలో కూరుకుపోయారు. వేరుశనగ, కంది, ఆముదం మొదలు వేసిన పంటలన్నీ నష్టపోయారు. ప్రభుత్వం రైతును ఆదుకునేందుకు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణం ఉపాధి కల్పించేలా కరువు సహాయ చర్యలు తీసుకొని, రైతుకు మేలు కలిగేలా చూడాలని, అలాగే రైతు కూలీలకు పనులు కల్పించాలని కర్నూలు జిల్లా గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వలసలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News