వైయస్ఆర్ కడప జిల్లా, జమ్మలమడుగు రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. బుధవారం ఉదయం 5 గంటలకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. తల, మొండెం వేరు వేరు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతిని వివరాలు
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కాకరవాడ కాపు వీధికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఇతని పేరు దండే హరీశ్ రెడ్డిగా తెలిపారు. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులకు కడుపు కోత
చేతికొచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడితే ఆ తల్లిదండ్రుల వ్యధను ఎవరు తీర్చాలని చూట్టున్న జనాలు అనుకుంటున్నారు. ఏదైనా బతికి సాధించాలి కానీ చనిపోతే ఏం సాధిస్తారని వాపోయారు. ఉద్యోగాలు లేకుంటే కూలీ పని చేసుకుని బతకాలి కానీ ఇలా తనువు చాలిచటం సరైనది కాదని చెబుతున్నారు.
Suicide:ఉద్యోగం రాలేదని రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES