డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లాలోని డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత, NTR జిల్లా రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసాలు, బంధువుల ఇళ్లపైన అవినీతి నిరోధక శాఖ సోదాలు వరుసగా రెండవ రోజు అంటే ఈరోజు కూడా కొనసాగుతున్నాయి.
అక్రమార్జన, అక్రమ ఆస్తుల సమాచారంపై అజ్జా రాఘవరావు, రిజిస్ట్రార్, సబ్-రిజిస్ట్రేషన్ ఆఫీసు, పటమట, విజయవాడ, NTR జిల్లా, అధికారి కార్యాలయం మరియు నివాసము పై అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది.
నిన్న సాయంత్రం సుమారు 5.30 గంటల నుండి అజ్జా రాఘవరావు, సబ్ రిజిస్ట్రార్, సబ్-రిజిస్ట్రేషన్ ఆఫీసు, పటమట, విజయవాడ, NTR జిల్లా, అను నిందిత అధికారి అక్రమముగా స్థిర, చరాస్తులు ఆర్జించినాడన్న సమాచారముపై సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు సదరు అధికారి నివాసం, కార్యాలయంతో పాటు ఇతర 4 ప్రదేశాలలో ఏక కాలములో సోదాలు నిర్వహిస్తున్నారు.
అసిస్టెంట్-రిజిస్ట్రార్ ప్రేమరపోగు సుజాత నుండి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు:
• కర్నూలు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు,
• కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు,
• కస్తూరి నగర్ కాలనీ, కర్నూలు టౌన్ లో ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో G+1 దుకాణంతో కూడిన ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో మరో దుకాణం
• కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి.
• కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000/- విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు
• 40 తులాల బంగారం
• ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు, ఒకటి 2 వీలర్.
• ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం మరియు గృహోపకరణాలు
• రూ. 8,21,000/- నగదు