వైయస్సార్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని గెడ్డంగి వీధిలో గురువారం అత్యంత కిరాతకంగా కారంపొడి చల్లి లక్ష్మి దేవి అనే మహిళపై కత్తితో దాడి(Attack) చేసి బంగారు దోచుకెళ్లిన ఆకుల నవీన్ తోలగంగనపల్లె వద్ద అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు కమలాపురం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో తెలిపారు.
ముద్దాయి ఆకుల నవీన్ దుర్ వ్యసనాలకు క్రికెట్ బెట్టింగ్ తదితర విలాసాలకు అలవాటు పడి ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో చొరబడి బంగారు ఎత్తుకెళ్లాడని అతని వద్ద ఒక సరుడు నల్లపూసల దండ కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
త్వరితగతిన కేసును చేదించిన సీఐ రోషన్ సిసిఎస్ సిఐ భాస్కర్ రెడ్డి ఎస్ఐ ప్రతాపరెడ్డి లను అభినందించి వారికి రివార్డులు కూడా వచ్చేందుకు పై అధికారులకు సిఫార్సు చేస్తామని తెలిపారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యొక్క స్థితిగతులు తెలుసుకొని వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే వాటిపై దృష్టి సారించాలని డిఎస్పీ తెలిపారు.