జూబ్లీహిల్స్ లో రూ. 30 కోట్ల ఇంటి కబ్జా కోసం యత్నం. సినీ నటి స్వాతి దీక్షిత్ తో సహా పలువురు వ్యక్తుల మీద కేసు నమోదు అయింది. లీజు వ్యవహరంలో ఎన్అర్ఐతో ఏడాది కాలంగా స్వాతి దీక్షిత్ కి వివాదం నడుస్తోండగా కోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉంది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే అమెరికాలో ఉన్న మహిళకు చెందిన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు దుండగులు. ఈమేరకు ఇంటి వాచ్ మెన్ ఫిర్యాదు చేయగా పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో స్వాతి దీక్షిత్ తో పాటు చింతల ప్రశాంత్.. రణ్వీర్ సింగ్.. కండె రామ్ కుమార్ సహా 20 మందిపై ఐపీసీ 147, 148, 447, 427, 504, 506 సెక్షన్స్ కింద కేసు కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.
- Advertisement -