ఆన్ లైన్ గేమ్స్(Online game)కు బానిసై మరో విద్యార్థి ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన మాదాపూర్ ఖానామెట్ లో చోటుచేసుకుంది. అరవింద్ అనే (23) ఏళ్ల యువకుడు ఆన్ లైన్ గేమ్స్ ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
డిగ్రీ చదువుతున్న అరవింద్ మాదాపూర్ ఖానామెట్ లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. గతంలో ఆన్ లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోవడంతో ఇంట్లో నుంచి యువకుడు అరవింద్ పారిపోయాడు. అప్పటికి అరవింద్ ను వెతికి ఇంటికి తెచ్చారు తల్లిదండ్రులు.
సోమవారం రాత్రి కూడా ఆన్ లైన్ గేమ్ ఆడి మరో అరవై వేలు అరవింద్ పొగొట్టాడు. దీంతో తనని మళ్లీ తల్లిదండ్రులు ఏమైనా అంటారో ఏమోనని మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు తెలిపారు.
గమనించిన తల్లిదండ్రులు వెంటేనే స్థానిక ఏరియా హాస్పిటల్ తరలించారు. ఈ లోపే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చెట్టంతా కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో తట్టుకోలేకపోయారు.