హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం( Accdient) జరిగింది. మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. స్పాట్లోనే అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు.
హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతుండగా అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో కిందపడ్డ ఆయన వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కడంతో బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు.
ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్నారు TM నందీశ్వర బాబ్జీ. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.