Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుAndole: కల్లులో కిక్కు కోసం ఏం కలుపుతున్నారు తెలుసా?

Andole: కల్లులో కిక్కు కోసం ఏం కలుపుతున్నారు తెలుసా?

కొకైన్ కంటే ప్రమాదకరం అల్పాజోలం

కిక్కు కోసం కల్లులో అల్పాజోలం కలుపుతారు. ఈ అలాపజోలం అనేది కోకెన్ కంటే ప్రమాదకరమైనది. కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్ అయిన అల్పజోలం వాడుతున్నట్లు యాంటీ నర్కోటిక్, ఎన్ ఏ బి, గుర్తించింది. అల్పజోలం కల్పిన కల్లు వల్ల వేలాది మంది అక్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథంలో ఎన్ ఏ బి దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది.

- Advertisement -

అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై ఫోకస్ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు. గంజాయి తర్వాత ఇదే:-
రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేరెవరు మార్గాలలో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యంగ్జాయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోస్ ను మాత్రమే ఇస్తారు. దీనికి కారణం ఆల్ఫాజోలం అంత్యత ప్రమాదకరమైన డ్రగ్ కావటమే.


ఎక్కువ మత్తు కోసం : కళ్ళు ఎక్కువ కిక్కు ఎక్కేందుకు విక్రయదారులు ఆల్ఫా జోలం ను వినియోగిస్తున్నారని తెలంగాణ, ఎన్ ఏ బి చీఫ్, సందీప్ శాండీలా చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీకల్లు కోసం డైజోపాం, క్లోరల్ హైడ్రేట్ లను వాడే వారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రేట్లు మత్తు కలిగించే ఆల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10, గ్రాములకు రూ,, 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసల కల్లును తయారు చేస్తున్నారూ. ఒక్కొక్క సీసా 50 ఉండగా సుమారు రూ,,13,50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. వీటివల్ల ఎన్ ఏ బి అధికారులు హైదరాబాదులో దాడులు జరపగా 66 కాంపౌండ్ల్లో కల్తీకల్లు విక్రయిస్తున్నట్లుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టం చేస్తోంది.

ముంబై నుంచి ఎక్కువగా :-
రాష్ట్రానికి ముంబై నుంచి ఈ డ్రగ్ వస్తుందని ఎన్ ఏ బి కి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివర్లలోనూ తయారవుతుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్ కు ఒక్కసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరకక చాలా మంది విచిత్రంగా ప్రవర్తించడంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
సిండికేట్కు పొలిటికల్ అండ :-
ఈ కల్తీ కల్లు సిండికేట్కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. ఈ విధంగా కల్తీ కల్లు తయారుదారులు కల్లును విక్రయించి వినియోగదారులను బానిసలు చేసేస్తున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంనే తీసుకుంటే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గాల్లో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఈ విధంగా కల్తీ కల్లు తయారు చేసి ఎందరో అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. ఈ కల్తీ కల్లు వల్ల కొందరు చనిపోతే అప్పటి ఎక్సేంజ్ శాఖ అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే ఈ విషయం పెద్దది కావడంతో కొన్ని శ్యాంపిళ్లనూ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అయితే వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాకపోవటం మరో మిస్టరీగా మారింది. ప్రజల ప్రాణాలతో చెలగడ్డ మారుతున్న ఈ కల్తీ కల్లు తయారుదారులపైన ఎక్సైజ్ శాఖ నిఘాపెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News