Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుAhmedabad plane crash: బ్లాక్ బాక్స్ ఎక్కడికీ పంపలేదు, భారత్ లోనే ఉంది..!

Ahmedabad plane crash: బ్లాక్ బాక్స్ ఎక్కడికీ పంపలేదు, భారత్ లోనే ఉంది..!

Black box update: అహ్మదాబాద ఘోర ప్రమాద ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్ పై రోజుకో వార్త వైరల్ అవుతుండగా.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా ఆ అంశంపై స్పందించారు. పూణేలో జరిగిన ‘హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ సమ్మిట్ – 2025’ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపిస్తున్నారా?” అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆ ప్రచారాలన్నీ కేవలం ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. బ్లాక్ బాక్స్ భారత్‌లోనే ఉందని, ప్రస్తుతం AAIB దీనిని పరిశీలిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. “డేటాను ఎప్పట్లోగా పొందవచ్చు?” అనే మరో ప్రశ్నకు స్పందిస్తూ, అది చాలా సాంకేతికతతో కూడిన వ్యవహారమని, AAIB దర్యాప్తు పూర్తి చేసి, మొత్తం ప్రక్రియను పరిశీలించడానికి సమయం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

దీంతో ప్రమాదంలో లభ్యమైన ఆ బ్లాక్ బాక్స్ ..ఏ విదేశాలకు పంపబడలేదని, అది ఇంకా భారత్‌లోనే ఉందని స్పష్టమైంది. అయితే దీనిపై చేస్తున్న మరికొన్ని విశ్లేషణ ద్వారా ప్రమాదానికి గల కారణాలు త్వరలోనే వెల్లడవుతాయని వారు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మధ్యాహ్నం 1:39 గంటల ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఆ విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన రోజు నుంచే దీనిపై విచారణ మొదలైంది.

ప్రస్తుతం, ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో తెలుసుకొనే వీలు గల ‘బ్లాక్ బాక్స్’ పై విశ్లేషణపై జరుగుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం ఈ బ్లాక్ బాక్స్‌ను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. బ్లాక్ బాక్స్ బాగా దెబ్బతిందని, దాన్ని విదేశాలకు పంపించడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad