Wednesday, September 18, 2024
Homeనేరాలు-ఘోరాలుAkshara Chit fund Chairman Director arrest: అక్షర చిట్ ఫండ్ చైర్మన్ డైరెక్టర్...

Akshara Chit fund Chairman Director arrest: అక్షర చిట్ ఫండ్ చైర్మన్ డైరెక్టర్ ల అరెస్ట్

ఆస్తులను జప్తు

ఖాతాదారులకు సకాలంలో డబ్బు చెల్లించకుండా మోసగించినందుకు అట్టి సొమ్మును సొంత ఆస్తులు కూడపెట్టుటకు ఉపయోగించినందుకుగాను అక్షర చిట్ ఫండ్ చైర్మన్ తో సహ మరో ఐదుగురు డైరెక్టర్లపై కేసు నమోదు. ప్రజలను మోసగించి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన సొంత ఆస్తులను జప్తు చేయుటకు గాను తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 3 మరియు 4 ప్రకారం చర్యలు చేపట్టిన పోలీసులు . అక్షర చిట్ ఫండ్స్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు మరియు ఇద్దరు డైరెక్టర్లైన సూరినేని కొండలరావు, ఉప్పల రాజేందర్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. కరీంనగర్లోని సీతారాంపూర్ కు చెందిన శ్రీరామ్ వెంకట్ రెడ్డి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అక్షర ఏడు లక్షల రూపాయల చిట్టీ వేయగా, చిట్టీ యొక్క గడువు ముగిసినప్పటికీ 7 లక్షల రూపాయల మొత్తాన్ని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినందుకు గాను బాధితుడు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు 109/2024 U/Sec 406, 420 r/వర్క్ 34 ఐపీసీ మరియు 5 ఆఫ్ ది తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగించామన్నారు.

- Advertisement -

విచారణలో అనేక అనేక విషయాలు, ప్రజలను మోసం చేసిన విధానం వెలుగులోకి వచ్చిందన్నారు. హనుమకొండలోని సుబేదారి, వడ్డేపల్లి ఎక్స్ రోడ్ ఎస్బిహెచ్ కాలనీకి చెందిన పేరాల శ్రీనివాసరావు తండ్రి భీమ్ రావు అనే వ్యక్తి తిరుపతి రెడ్డి అనే వ్యక్తితో కలిసి సంవత్సరంలో హనుమకొండ పట్టణంలో చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు అన్నారు. తదుపరి తిరుపతిరెడ్డి ఇట్టి సంస్థ నుండి వైదొలగగా శ్రీనివాసరావు భార్య అయిన A2) పేరాల శ్రీవిద్య A3) సూర్యుని కొండలరావు A4) పుప్పల రాజేందర్ A5) అలువల వరప్రసాద్ A6) గోనె రమేష్ లు అయిదుగురు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారన్నారు. ఇదిలా ఉండగా సంస్థను విస్తరించుటకు ప్రజంట్లను మేనేజర్లను నియమిస్తూ జిల్లాలైన కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్,బోధన్,ఆదిలాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని,మంచిర్యాల, హైదరాబాద్,ఖమ్మం,నల్గొండ మరియు ఇతర పట్టణాలలో 54 బ్రాంచీల వరకు ఏర్పాటు చేశామన్నారు.

వీరి అక్షర ప్రైవేట్ చిట్ ఫండ్ నందు ప్రజలు సులువుగా నమ్మి చిట్టీలు వేయుటకు అనేకమంది ఏజెంట్లను నియమించుకున్నామన్నారు. ప్రజల వద్ద నుండి చిట్ఫండ్ రూపంలో వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలని దురుద్దేశంతో పలుచోట్ల భూములను కొనుగోలు చేస్తూ వచ్చామన్నారు. గడువు ముగిసిన కస్టమర్లకు డబ్బు చెల్లించకుండా వారిని నమ్మించుటకు గాను వారు డిపాజిట్ చేసిన డబ్బు మొత్తానికి డిపాజిట్ బాండ్ల రూపంలో ఇస్తూ కాలయాపన చేస్తూ వచ్చామన్నారు. ఇట్టి బాండ్లు ఖాతాదారులకు ఇచ్చుట కొరకు అక్షర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు అక్షర టౌన్షిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను నెలకొల్పామన్నారు. ఈ విధంగా ఇచ్చినటువంటి బాండ్ల గడువు ముగిసినప్పటికీ కూడా వాటిని తిరిగి రెన్యువల్ చేస్తూ ఖాతాదారులకు అందిస్తున్నామన్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన సంస్థల్లో కరీంనగర్లో టవర్ సర్కిల్, మంకమ్మతోట, కోతిరాంపూర్, రేకుర్తి నాలుగు బ్రాంచీలను ఏర్పాటుచేసి వాటిలో 800 కస్టమర్లను సభ్యులుగా చేర్చుకోగలిగామన్నారు.

అక్షర చిట్ఫండ్ సంస్థ నందు 25 లేదా 50 మందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారి వద్ద నుండి ప్రతినెలా చిట్ ఫండ్ డబ్బులు వసూలు చేస్తూ ప్రతి నెల చిట్ఫండ్ ఆక్షన్ చేస్తూ, డివిడెంట్ మొత్తాన్ని వారికి సమానంగా భాగాలుగా పంచుతూ, వచ్చిన మొత్తాన్ని సొంత ఆస్తులు కూడపెట్టుటకు ఉపయోగించామన్నారు. గడువు తేదీ ముగిసిన కొంతమంది కస్టమర్లకు డబ్బు మొత్తాన్ని ఇవ్వకుండా వారికి అధిక వడ్డీ అందిస్తామని దానికిగాను ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేని బాండ్ల రూపంలో ఖాతాదారులకు ఇస్తూ మోసగిస్తూ వచ్చామన్నారు. కస్టమర్లు డిపాజిట్ చేసిన డబ్బుతో కరీంనగర్ లోని వెదిర, వెలిచాల లో 50 ఎకరాలు వ్యవసాయ భూమి, మరియు గాడిపల్లి గ్రామంలో వ్యవసాయ భూములు నగునూరు శివారులో దుర్గామాత ఆలయ సమీపంలో కొంతమంది రైతుల వద్ద నుండి భూములు సేకరించామని విచారణలో తేలింది అన్నారు.

సీతారాంపూర్ చెందిన శ్రీరామ్ వెంకట్ రెడ్డి అక్షర చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ నందు ఏడు లక్షల రూపాయల చిట్టి వేద తేదీ ముగిసినప్పటికీని అతని ఏడు లక్షల రూపాయలు తిరిగి ఇవ్వకపోగా పై విధంగా మోసగిస్తూ కాలయాపన చేస్తూ అనేక ఇబ్బందులకు గురిచేరని విచారణలో తేలింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడమేగాక వారిలో ముగ్గురైన హనుమకొండ కు చెందిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ చీరాల శ్రీనివాసరావు తండ్రి భీమ్రావు వయసు 49 సంవత్సరాలు, హనుమకొండ లోని గోపాల్పూర్ కు చెందిన సూరినేని కొండలరావు తండ్రి రాజేశ్వరరావు, వయసు45 సంవత్సరాలు, హనుమకొండ లోని కాజీపేట కు చెందిన పుప్పల రాజేందర్ వయసు 47 సంవత్సరాలు లను బుధవారంనాడు అరెస్ట్ చేసి గౌరవ సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నందు హాజరు పరచగా కేసు పూర్వపరాలు పరిశీలించిన గౌరవ మెజిస్ట్రేట్ నిందితులను 14 రోజుల రిమాండ్ విధించగా, వారిని కరీంనగర్ జైలుకు తరలించారు. గతంలో కూడా వీరిపై పలు పోలీస్ స్టేషన్లయందు నందు అనేక కేసులు నమోదు కాబడి ఉన్నాయన్నారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ నందు నందు కేసులు నమోదు కాబడి ఉన్నాయని విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News