Monday, July 8, 2024
Homeనేరాలు-ఘోరాలుAllagadda: 2 కిలోల గంజాయి స్వాధీనం

Allagadda: 2 కిలోల గంజాయి స్వాధీనం

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యక్రమాలపై నిఘా ఉంచి ఆళ్లగడ్డ మండలంలోని కొండంపల్లి గ్రామ సమీపంలో గంజాయి పంపకాలు చేసుకుంటున్నా 11 మందిని అదుపులోకి తీసుకొని 2 కిలోల 380 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డిఎస్పి వెంకటరామయ్య తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి వెంకటరామయ్య మాట్లాడుతూ ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని ఆళ్లగడ్డ పట్టణము ఆళ్లగడ్డ మండలము చాగలమర్రి ,సిరివెళ్ల ఉయ్యాలవాడ మొదలు ప్రాంతాలలో యువకులు మరియు పెద్దలు గంజాయి తాగుతూ మరియు ఎక్కువ రేటు అమ్ముతూ చెడు వ్యసనాలకు లోనైన వారిని అరికట్టుటకు రాబడిన సమాచారం మేరకు శుక్రవారం మండలంలోని ఆర్ కృష్ణాపురం నుండి కొండంపల్లి పోయే దారిలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వారిలో ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అంబటి మద్దిలేటి రెడ్డి, సిసిఎల్ బాలుడు, పట్నం రాఘవేంద్ర ,దుత్తలూరు దస్తగిరి చిన్నచేనుపల్లె దువ్వూరు మండలం కడప జిల్లా, వడ్డే బాల నరసింహుడు చింతలచెరువు చాగలమర్రి మండలం ,హుస్సేన్ వల్లి చింతకుంట గ్రామం ఆళ్లగడ్డ మండలం, పత్తి రాముడు మర్రిపల్లి గ్రామం ఆళ్లగడ్డ మండలం ,వీరిని అరెస్టు చేసి ఈ ఏడుగురు వద్ద నుండి 1230 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని అలాగే పెద్ద కందుకూరు మెట్ట వద్ద ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద ఉన్న పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన పగిడాల శివుడు, పెనుగొండ శివప్రసాద్ ,షేక్ అల్లాబకాష్, బొంతల నారాయణ, గంజాయి అమ్ముతుండగా వారిని కూడా అరెస్టు చేసి వారి వద్ద నుండి 1150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని మొత్తం 2 కేజీల 380 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి వెంకటరామయ్య తెలిపారు .ఈ కేసులో ఇంకా 10మందిని త్వరలో అరెస్టు చేస్తామని మొత్తం 21 మంది పై ఆళ్లగడ్డ రూరల్ సిఐ ఎన్ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసినట్లు ఈ దర్యాప్తులో ఆళ్లగడ్డ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఎస్సైలు రూరల్ ఎస్సై నరసింహులు దొర్నిపాడు ఎస్సై తిరుపాలు ఉయ్యాలవాడ ఎస్సై సత్యనారాయణ, చాగలమరి ఎస్సై రమణయ్య, ఏఎస్ఐ సురేష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది వేణుగోపాల్,, శ్రీనివాసులు, కుమార్ ,భాస్కర్ మధు, హోంగార్డు చంద్రబాబు వీరందరినీ ఉన్నతాధికారులు అభినందించారు డిఎస్పి మాట్లాడుతూ ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో మట్కా గంజాయి జూదం సారా తదితర వాటిల్లో తలదూరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎలాంటి వారైనా సరే ఉపేక్షించేది లేదని అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డిఎస్పి వెంకటరామయ్య తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News