అనకాపల్లి పోలీసుల పేరు ఇప్పుడే దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఏడాది కాలంలోనే ఏకంగా 11,370 కేసులను ఛేదించిన పోలీసులుగా అనకాపల్లి పోలీసుల సక్సెస్ స్టోరీ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అనకాపల్లి ఖాకీల చొరవతో ఈ ప్రాంతంలో ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, హత్యా యత్నాలు తగ్గుముఖం పట్టాయి. 67 శాతం కేసులను వీరు విజయవంతంగా ఛేదించగా మరోవైపు ఇక్కడ సైబర్ క్రైముల సంఖ్య ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సైబర్ క్రైము కేసులను కూడా 54శాతం వరకూ క్లియర్ చేయటం మరో హైలైట్. తమ జిల్లాలో మొత్తం 17,284 కేసులు నమోదయ్యాయని వీటిలో 9,375 కేసులు పాతవేనని అనకాపల్లి ఎస్పీ గౌతమి సాలి వెల్లడించారు. జిల్లాలో 37 బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రయత్నించటం సత్ఫలితాలను ఇచ్చినట్టు ఎస్పీ వివరించారు.
Anakapalli Super Cops: ఏడాదిలో 11,000 కేసులు ఛేదించారు, శెభాష్ ఖాకీలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES