సంచలనం సృష్టించిన మీర్‌పేట మహిళ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. పోలీసులు గట్టిగా విచారణ జరుపుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. మాజీ జవాను గురుమూర్తి సూక్ష్మ దర్శిని సినిమా చూసి భార్యను హత్య చేశాడు. సూక్ష్మ దర్శిని సినిమా తరహాలో మాధవి మృతదేహాన్ని డిస్పోస్ చేసేశాడు. కెమికల్స్‌లో నానబెట్టి కాల్చి మృతదేహాన్ని పొడిగా మార్చి పొడిని చెరువులో చల్లినట్లు తెలిసింది. బ్లూ రేస్ టెక్నాలజీతో ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. సాయంత్రంలోగా గురుమూర్తి పైన యాక్షన్ కి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమా తెలుగులోనూ విడుదలైంది. ఈ చిత్రంలో శవాన్ని ఓ ట్యాంకులో పెట్టి యాసిడ్, రసాయనాలు కలిపేస్తారు. ఆ రసాయనాలు శవాన్ని కరిగించి నీళ్లలా మార్చేస్తాయి.శవం మొత్తం కరగడానికి సూమారు వారం రోజులు పడుతుంది.ఆ నీళ్లను కొంత కొంత చొప్పున వాష్‌రూమ్ నుంచి ఫ్లష్ ద్వారా మెల్లమెల్లగా వదులుతారు. కరిగిపోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా తర్వాత పొడి చేసి ఫ్లష్ ద్వారానే డ్రైనేజీలోకి వదిలేస్తారు. మెుత్తం మీద ఈ సినిమాలో హీరోయిన్ నిజాలు బయట పెడుతుంది.
ఇలానే సూక్ష్మదర్శిని సినిమా కథ ఆధారంగానే వెంకట మాధవి హత్య కేసులోనూ నిందితుడు ఆమె శవాన్ని ఆ సినిమాలో చూపించినట్టే మాయం చేయాలని భావించాడు. హెక్సా బ్లెడుతో తల, మొండెం వేరు చేసి, శరీరాన్ని మూడు భాగాలుగా కోసి, మాంసాన్ని బకెట్‌లో వేసి నీళ్లు పోసి హీటర్‌తో మరిగించి, ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్, ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న చిన్న ముద్దలయ్యేలా చేసినట్లు తెలిసింది. ఎముకలను స్టవ్‌పై కాల్చి చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి, దంచి పొడిలా మార్చినట్లు సమాచారం. వీటిని కొంత బాత్‌రూమ్‌లో ఫ్లష్ ద్వారా, మిగిలినది బకెట్‌లో వేసుకొని మీర్‌పేట పెద్ద చెరువులో పారేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.