రాష్ట్రంలో అధికంగా మహిళలు మిస్సింగ్ కావడం బాధాకరం అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. డోన్ పట్టణం ఆటోనగర్ లో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో అధికారికంగానే 38,000 మహిళల మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి అంటే రిజిష్టర్ కానివి ఇంకా ఎన్నో. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో పోలీసు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆమె అన్నారు. మహిళలు ఏకమై సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రాధిక, వెంకటలక్ష్మి, శిరోమణి, బోయ లక్ష్మీదేవి, దూదేకుల షేకూన్ బీ,వడ్డే వరలక్ష్మీ, ఉషారాణి, పద్మావతి, పుల్లమ్మ, సుబ్బలక్ష్మి, చాంద్ బీ, వడ్డే సరోజ, చాకలి సరోజ, ఆకుతోట పద్మావతి, గుండెపోగు ప్రభావతి, కొమ్ము పెద్దక్క మంగమ్మ , లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
AP missing cases: అధికమవుతున్న మహిళల మిస్సింగ్ కేసులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES