ఆత్మకూరు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్ద అనంతపురం గ్రామ శివారులో ఆవుల మందపై పెద్ద పులి దాడి చేయడం వల్ల రెండు ఆవులను చనిపోయాయి, గమనించిన పశువుల కాపరులు కేకలు వేయడంతో పెద్ద పులి పరారైంది. పంట పొలాల్లో ఆవులు మేపుతుండగా కాపరి ముందే పెద్దపులి దాడి చేయడంతో రెండు ఆవులను గొంతుకు బలమైన గాయం కావడంలో కొన ఊపితో కొట్టుమిట్టాడుతూ చివరికి మృత్యువాత పడ్డాయని పశువుల కాపరు తెలిపారు. దీంతో పెద్దానంతాపురం గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అంతేకాకుండా అడవిలో నీరు లేక పులులు, చిరుతలు కొంతకాలంగా అటవీ సమీప గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు చర్యలు చేపట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Athmakur: ఆవుల మందపై పెద్ద పులి దాడి, రెండు ఆవులు మృతి
కాపరి ముందే పెద్దపులి దాడి చేసిన పెద్ద పులి, కాపరుల కేకలతో పారిపోయిన పులి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES