ఆత్మకూరు మండల పరిధిలోని ముష్టపల్లె గ్రామ సమీపంలో బర్రెల మందపై శుక్రవారం పెద్దపులి దాడిచేసింది. పంట పొలాల్లో బర్రెల మేపుతుండగా కాపరి ముందే పెద్దపులి దాడి చేయడంతో పశువుల కాపరి కేకలు వేస్తూ అరవడంతో పెద్దపులి పెద్దపులి పారిపోయింది. పెద్దపులి దాడి చేయడంతో గేదె గొంతుకు బలమైన గాయం కావడంలో కొన ఊపితో కొట్టుమిట్టాడుతూ చివరికి ప్రాణాలు వదిలినట్లు పశువుల కాపరి తెలిపాడు. రెండు నెలలుగా సమీప పంట పొలాల్లో సంచరిస్తున్న పెద్దపులిని అడవిలోకి పంపించాలని అటవీ శాఖ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో ముష్టేపల్లి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి పెద్దపులిని అడవిలోకి తరిమెందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
Athmakuru: బర్రెల మందపై పెద్దపులి దాడి, పట్టించుకోని అటవీశాఖ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES